వైసీపీ పాలనలో అరాచకం పెచ్చుమీరుతోంది అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. హారన్ కొట్టడం కూడా నేరమే అని చట్టం చేస్తారేమో?.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకం అనే మాట తప్ప అభివృద్ధి అనే మాట ఎక్కడా వినిపించడం లేదు.. అధికార దుర్వినియోగం, అందుకు తోడైన అహంకారంతో వైసీపీలో ప్రతి స్థాయి నాయకుడు ప్రజల మీదా, ఉద్యోగుల మీదా జులుం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.
జిల్లాల అధ్యక్షులు, ఇంఛార్జీలు, ముఖ్య నేతలతో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు జరిగే జనసేన - టీడీపీ సమన్వయ సమావేశాలపై చర్చించారు.. ఉమ్మడి జిల్లాల వారీగా జరిగే ఈ సమన్వయ సమావేశాలను పార్టీ శ్రేణులు సీరియస్‌గా తీసుకోవాలవి సూచించారు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వారాహి యాత్ర 5వ దశ నిర్వహణ, జనసేన - తెలుగుదేశం సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశ నిర్వహణ అంశాలపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సుదీర్ఘంగా చర్చించారు.
బ్యానర్లు , ఫోటోలు వేసుకున్నంత మాత్రానా లీడర్లు అయిపోయాం అనుకోవద్దని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. నాయకుడు ఏం చెబుతున్నాడో వినండి , దాన్ని ప్రచారం చేయండంటూ జనసేన నేతలకు ఆయన సూచించారు.
నాలుగో విడత యాత్ర ఇవాళ్టి నుంచి అవనిగడ్డ వేదికగా ప్రారంభం అవుతుంది అని నాదేండ్ల మనోహర్ అన్నారు. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి కూడా ప్రజలు, అభిమానులు భారీగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.