Nadendla Manohar : ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1,77,934 మంది రైతుల నుంచి 11.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేసిందని.. రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటి వరకు రూ. 2,830 కోట్లు జమ చేసినట్లు ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.రైతులు ధాన్యం విక్రయ ప్రక్రియలో ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు.. విజయవాడ కానూరు సివిల్ సప్లై భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.…
Minister Nadendla: బాపట్ల జిల్లాలోని చెరుకు పల్లె మండలం నడింపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంది.
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు నవంబర్ 3 నుంచి ప్రారంభం కానుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి వాట్సాప్ నంబర్ 7337359375 కు “HI” అనే సందేశం పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మంత్రి వివరించారు. 2025–26 ఖరీఫ్ పంట సీజన్‌లో 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు,…
Cyclone Montha: మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది జనసేన పార్టీ.. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తుఫాన్ సహాయక చర్యల్లో జనసేన నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జనసైనికులు, వీర మహిళలు ముందుండాలని మంత్రి మనోహర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ యంత్రాంగానికి పార్టీ శ్రేణులు తగిన విధంగా…
Minister Nadendla: విశాఖపట్నంలో పీడీఎస్ రైస్ గుర్తించే రాపిడ్ కిట్స్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం కాకినాడ పోర్టులో జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై అధ్యయనం చేసి చర్యలు చేపట్టాం.. కాకినాడ నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకును పరిశీలించి మన దేశానికి చెందిన పీడీఎస్ రైస్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
Deputy CM Pawan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యా్ణ్ తో తన ప్రయాణం మొదలైన రోజును మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా 2018 అక్టోబర్ 12వ తేదీన ప్రారంభమైన ప్రయాణం జనసేనతో నా రాజకీయ ఆరంభం అంటూ అప్పటి ఫోటోను షేర్ చేశారు.
Nadendla Manohar: దేశ రాజకీయాలలో మార్పు తీసుకురావాలనేది జనసేన లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేశామని తెలిపారు. తాజాగా గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో కులాలను కలపాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ దని.. జనసేన కమిట్మెంట్ తో పనిచేస్తుందన్నారు. వైసీపీ అధినేత జగన్ అవలంబిస్తున్న తీరు కరెక్ట్ కాదన్నారు. గతంలో వైసీపీ చేసిన అరాచక పాలన ఎవరూ మర్చిపోయారని.. అమలాపురంలో కులాల మధ్య చిచ్చుపెట్టిన తీరు ఎవరూ…
Minister Nadendla: గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. కొల్లిపర మండలం కరకట్ట లంక ప్రాంతాలు, తెనాలి మండలం గోలి డొంక పంట పొలాలను పరిశీలించారు.
గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు సబ్సిడీ కింద వ్యవసాయ యంత్రాలు అందజేశారు. 33మంది రైతులకు 80శాతం సబ్సిడీపై రూ.12లక్షల విలువైన గల వ్యవసాయ పరికరాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు కులం ఉండదు... పార్టీ ఉండదు... రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుందని తెలిపారు. రైతులు పంటలు అమ్మకోవటానికి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా హాయ్ అని పెడితే అన్ని మీదగ్గరకే వస్తాయని వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ద్వారా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పని చేస్తోంది. ఇందులో బాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీలో నూతన విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి రేషన్ షాప్ వద్ద ‘క్యూఆర్ కోడ్’ పోస్టర్లను ఏర్పాటు చేసింది. రేషన్ కార్డు దారులు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి.. తమ అభిప్రాయాలు, ఫిర్యాదులు తెలియచేయవచ్చు. అభిప్రాయాలు, ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన వెబ్ ఫారమ్లో సరైన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.…