Pemmasani Chandrasekhar: జగన్ ప్రభుత్వంపై పెమ్మసాని ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pemmasani Chandrasekhar: ‘గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా ఆపేసిన జగన్ ప్రజాపక్షపాతి కాదు కక్షపాతి. ఈ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు.’ అని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. తెనాలిలోని పూలే కాలనీలో శిథిలావస్థకు చేరిన టిడ్కో ఇళ్లను నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌తో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం పరిశీలించారు. పరిశీలన అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఆవాస యోజన-ఎన్టీఆర్ గృహకల్ప పథకం కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు గూడు కల్పించాలనే సంకల్పంతో టిడ్కో ఇళ్లను నిర్మింప చేశారన్నారు. కేవలం చంద్రబాబుకు పేరు వస్తుందనే కక్షతోనే టిడ్కో ఇళ్లను ప్రజలకు ఈ ప్రభుత్వం కేటాయించలేదని ఆయన చెప్పారు.
Read Also: Purandeswari: ఏపీలో బీజేపీకి ఇంకొన్ని సీట్లు పెరుగుతాయని ఆశిస్తున్నాం..
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
అప్పులు తెచ్చుకొని మరి లబ్ధిదారులు వాటా చెల్లించిన ప్రజలకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం చెల్లిస్తానన్న లబ్ధిదారుని వాటా రాయితీ అందకపోగా, రుణాలకు వడ్డీలు చెల్లించలేక ప్రజల అవస్థలు పడుతూ, అద్దెలలో మగ్గిపోతున్నారని తెలిపారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. విధ్వంసంతో మొదలైన జగన్ ప్రభుత్వం అరాచకాలు నేటికీ కొనసాగుతున్నాయన్నారు. ప్రజా వేదిక, అమరావతి, టిడ్కో ఇళ్లు ఇలా వరుసగా కూల్చడం నష్టం కలిగించడమే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతుందని తెలిపారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులే ఈ టిడ్కో ఇళ్లల్లో చువ్వలు, గుమ్మాలు పీక్కుని వెళ్లి అమ్ముకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయని మనోహర్ విమర్శించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!