Devineni Umamaheswara Rao: మాజీ మంత్రి, సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు షాక్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం.. మైలవరం సీటు ఉమ ప్రత్యిర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే.. ఈ మధ్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించింది.. అయితే, వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన దేవినేని ఉమ.. నాలుగు సార్లు గెలిచి మంత్రిగా పనిచేశారు.. కానీ, గత ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు.. ఓటమితోపాటు పార్టీలో ఆయనపై అసంతృప్తి ఉండటంతో.. ఈ సారి టికెట్ ఇవ్వకుండా టీడీపీ అధిష్టానం పక్కనబెట్టినట్టుగా తెలుస్తోంది..
Read Also: Plane Crash: విమానం కూలిపోవడానికి సెకన్ల ముందు షాకింగ్ ఘటన.. చివరకి..?
వసంత.. టీడీపీలోకి రాకుండా, మైలవరం టికెట్ దక్కించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారని ఉమామహేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయి.. అతి సాధ్యం కాకపోవడం.. వసంత కృష్ణప్రసాద్ టీడీపీ గూటికి చేరడం.. ఈ సారి టికెట్ ఆయనకే దక్కుతుందనే ప్రచారం సాగుతోన్న తరుణంలో.. మైలవరం కాకపోయినా.. పెనమలూరు టికెట్ వస్తుందని భావించిందట దేవినేని ఉమ వర్గం.. కానీ, నాకు సీటు ఇవ్వా్ల్సిందే.. లేదంటే.. చంద్రబాబు ఫొటో పెట్టుకుని ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానంటూ భీష్మించుకు కూర్చున్నారు మాజీ మంత్రి బోడే ప్రసాద్.. దీంతో.. చివరకు పెనమలూరు టికెట్‌ను బోడే ప్రసాద్‌కే కట్టబెట్టింది టీడీపీ అధిష్టానం.. ఇక, మైలవరం చేజారిపోవడమే కాదు.. ఆశించిన పెనమలూరు టికెట్ కూడా దేనినేని ఉమామహేశ్వరరావుకు రాకుండా పోయింది. మరి దేవినేని సేవలను టీడీపీ ఎలా ఉపయోగించుకోవాలని చూస్తుందో చూడాలి మరి.