Meerut Murder: మీరట్ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. జైలులో ఉన్న ప్రధాన నిందితురాలు సౌరభ్ భార్య ముస్కాన్ గర్భవతిగా నిర్ధారణ అయింది. జైలు అధికారుల అభ్యర్థన మేరకు జిల్లా ఆస్పత్రి నుంచి ఒక టీమ్ సోమవారం జైలులో ఆమెకు పరీక్షలు చేసింది. ఈ పరీక్షల్లో ముస్కాన్ రస్తోగి గర్భవతి అని తేలింది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ అశోక్ కటారియా ముస్కాన్ ప్రెగ్నెన్సీని ధ్రువీకరించారు.
మర్చంట్ నేవీ అధికారి సౌరబ్ రాజ్‌పుత్ హత్య కేసులో నిందితులు ముస్కాన్, సాహిల్ శుక్లాకు చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైల్లో నటుడు, బీజేపీ నేత అరుణ్ గోవిల్ రామాయణం పుస్తకాలను అందజేశారు. జైల్లో మొత్తం 1.500 కాపీలను ఖైదీలకు పంపిణీ చేశారు. ‘‘ఘర్ ఘర్ రామాయణం’’ అనే కార్యక్రమంలో భాగంగా మీరట్ ఎంపీ అరుణ్ గోవిల్ ఈ విధంగా చేశారు.
Meerut Murder: మీరట్ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ దారుణహత్యలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న సౌరభ్, తన కుమార్తె బర్త్ డే కోసం ఇండియాకు తిరిగి వచ్చిన సమయంలో, భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె లవర్ సాహిల్ శుక్లాలు కలిసి కత్తితో దాడి చేసి హతమార్చారు. శరీరాన్ని ముక్కులుగా చేసి డ్రమ్ములో వేసి, సిమెంట్‌తో కప్పేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. డ్రగ్స్ బానిసలుగా మారిన ఇద్దరు…
Meerut Murder: ఉత్తర్ ప్రదేశ్ మీటర్‌లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ని అతడి భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలు కలిసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనమైంది. విదేశాల నుంచి కుమార్తె బర్త్ డే కోసం వచ్చిన అతడిని ఇద్దరు కలిసి మత్తు మందు ఇచ్చి, నరికి చంపారు. ఆ తర్వాత మృతదేహాన్ని డ్రమ్‌లో వేసి, సిమెంట్‌తో కప్పేశారు. మార్చి 04న జరిగిన ఈ ఘటనపై సౌరభ్ కుటుంబీకులు మిస్సింగ్…
Meerut Murder: మీటర్‌లో హత్యకు గురైన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల్లో పనిచేస్తున్న సౌరభ్, తన కుమార్తె పుట్టిన రోజు కోసం ఇండియాకు వచ్చిన తరణంలో మార్చి 04న అతడి భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె లవర్ సాహిల్ శుక్లాలు కలిసి దారుణంగా హత్య చేశారు. శరీరాన్ని ముక్కలు చేసి డ్రమ్‌లో వేసి, సిమెంట్‌తో కప్పేశారు. వీరిద్దరని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Meerut Murder: మీరట్ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ దారుణహత్యలో భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాల పైశాచికం వెలుగులోకి వస్తుంది. పోస్టుమార్టం నివేదికలో వీరిద్దరు ఎంత క్రూరంగా హత్యకు పాల్పడ్డారనే విషయం తెలిసింది. మార్చి 04న భార్య సౌరభ్‌కి మత్తు మందు ఇచ్చి, కత్తితో పొడిచి హత్య చేశారు.