Meerut Murder: ఉత్తర్ ప్రదేశ్ మీటర్‌లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ని అతడి భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలు కలిసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనమైంది. విదేశాల నుంచి కుమార్తె బర్త్ డే కోసం వచ్చిన అతడిని ఇద్దరు కలిసి మత్తు మందు ఇచ్చి, నరికి చంపారు. ఆ తర్వాత మృతదేహాన్ని డ్రమ్‌లో వేసి, సిమెంట్‌తో కప్పేశారు. మార్చి 04న జరిగిన ఈ ఘటనపై సౌరభ్ కుటుంబీకులు మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో మార్చి 18న వెలుగులోకి వచ్చింది. నిందితులు ఇద్దరూ డ్రగ్స్‌కి బానిసలైనట్లు తెలుస్తోంది. వీరిద్దరిని ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు.
Read Also: Mohanlal : లూసీఫర్-2 కోసం మోహన్ లాల్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా..?
ఇదిలా ఉంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్న సౌరభ్‌ని ముస్కాన్ అత్యంత దారుణంగా చంపడంపై ముస్కాన్ కుటుంబీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే తమ కూతురుకి జీవించే హక్కు లేదని, మరణశిక్ష విధించాలని ముస్కాన్ పేరెంట్స్ డిమాండ్ చేశారు. ముస్కాన్ రస్తోగికి కుటుంబీకులు న్యాయసాయాన్ని అందించేందుకు నిరాకరించారు. దీంతో ప్రభుత్వమే న్యాయవాదిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మీరట్ జైలులో ఉన్న ముస్కాన్, న్యాయవాదిని కోరుతూ శనివారం జైలు సూపరింటెండెంట్‌ని అభ్యర్థించింది.
మరోవైపు, సాహిల్ శుక్లా తనకు ప్రభుత్వ న్యాయవాది కావాలా..? వద్దా..? అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ మాట్లాడుతూ, ‘‘భద్రతా కారణాల దృష్ట్యా, కొత్త ఖైదీలను మొదట్లో కొత్త ఖైదీల బ్యారక్‌లో వేరుగా ఉంచుతారు. నిన్న ముస్కాన్ నన్ను కలవాలని కోరింది. నేను ఆమెను కలిసినప్పుడు, ఆమె కుటుంబం కలత చెందిందని, ఆమె కేసును వాదించడం లేదని చెప్పింది. అందువల్ల, ఆమె ప్రభుత్వ న్యాయవాదిని కోరింది.’’ అని చెప్పారు. ప్రతీ ఖైదీకి చట్టపరమైన సాయం పొందే హక్కు ఉంటుంది, ఒక ఖైదీకి ప్రైవేట్ లాయర్ లేకపోతే, అందించాల్సిన బాధ్యత ఉందని అన్నారు.