మునుగోడులో ఇవాళ్టి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఫాంను ప్రగతిభవన్‌లో అందజేశారు.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం మునుగోడు ఉపఎన్నిక. నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం పేర్కొంది.
మునుగోడు ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం, త్వరలో అభ్యర్థిని ప్రకటిస్తామని TJS అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. ఢిల్లీలో కేసీఆర్ కే కాదు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని మండిపడ్డారు.
తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు కొంత కాలంగా ఎదురుచూస్తోన్న మునుగోడు ఉప ఎన్నికకు సమయం రానే వచ్చింది.. ఇవాళ మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ నెల 7వ తేదీ మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు షెడ్యూల్‌లో వెల్లడించిన ఈసీ.. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరగనున్నట్టు పేర్కొంది. బీహార్‌లోని రెండు స్థానాలకు, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశాలోని ఒక్కో…
Etela Rajender Comments On CM KCR: తెలంగాణలో బీజేపీ రాకెట్ వేగంతో దూసుకుపోతోందని అన్నారు బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. మునుగోడు గడ్డపై ఎగిరేది కాషాయజెండానే అని అన్నారు. ప్రజాసంబంధ పథకాలను కేసీఆర్ ఎప్పుడూ తీసుకురాలేదని.. పవర్ ఓరియెంటెడ్ పాలసీలనే తీసుకువస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు ‘దళిత బంధు’ గుర్తుకు వచ్చిందని.. మునుగోడులో గిరిజనులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ‘గిరిజన బంధు’ ఇస్తా అంటున్నాడని ఎద్దేవా చేశారు. ఐఏఎస్, ఐపీఎస్…
మునుగోడు ఉప ఎన్నికలు రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి.. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో ఇక్కడ గెలిచి రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్లాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో మునుగోడు ఉప ఎన్నికకు ప్రాధాన్యం ఏర్పడింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.. ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నారు.. ఇతర పార్టీల నేతలను తమ వైపు తిప్పుకునేందుకు స్కెచ్‌లు వేస్తూనే ఉన్నారు.. తమ పార్టీలోకి రావలంటూ ఆహ్వానాలు పంపుతున్నాయి.…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక హీట్ పెంచుతోంది.. ఈ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది. సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో ఇక్కడ గెలిచి రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్లాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో మునుగోడు ఉప ఎన్నికకు ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న బీజేపీ.. మునుగోడులో ఎట్టి పరిస్థితుల్లో నెగ్గి తీరాలని పట్టుదలగా ఉంది. మునుగొడులో గెలవడం ద్వారా తెలంగాణలో…