ఖబడ్దార్ బీజేపీ.. మునుగోడులో మీకు కడతాం గోరీ అంటూ లంబాడి హ్కుల పోరాట సమితి హెచ్చరిస్తున్న పోస్టర్లను నిన్న అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అతికించారు.
జేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. 2016 లో ఇచ్చిన మీ హమీలు ఏమయ్యాయి? అంటూ ట్వీట్ వేదికగా ప్రశ్నలు గుప్పించారు. 2016లో మర్రిగూడలో నాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా, మీరు పర్యటిస్తూ, ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి.. ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వానికి ఇవాళ్టితో తెరపడింది.. దాదాసు 90 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టు తెలుస్తోంది.. చివరి రోజు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు.. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.. విస్తృతంగా ప్రచారం.. సభల్లో.. కార్యకర్తలతో.. ప్రజలతో మాట్లాడడంతో.. ఆమె గొంతు బొంగురుపోయింది.…
తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి… అన్ని ప్రధాన పార్టీలు కేంద్రీకరించి ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి.. మరోవైపు.. చిన్నపార్టీలు కూడా బరిలోకి దిగాయి.. ఇక, స్వతంత్రులు కూడా భారీ సంఖ్యలో పోటీకి దిగేలా కనిపిస్తోంది.. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల గడువు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది.. అయితే, ఇంకా చాలా మంది అభ్యర్థులు.. నామినేషన్ పత్రాలతో క్యూ లైన్‌లో వేచిఉన్నారు.. క్యూలైన్‌లో ఉన్న అభ్యర్థుల…
మునుగోడు ఉప ఎన్నికలో.. మద్యం ఏరులైపారుతోంది.. డబ్బులు పోటీపడి పంచుతున్నారనే వార్తలు వస్తున్నాయి.. నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే.. బేరసారాలపై వార్తలు రాగా.. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత.. ఇది మరింత పెరిగిందట.. అయితే, డబ్బులు ఎవరు ఇచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకే వేయండి అని సూచించారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి… టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మీడియా చిట్‌చాట్‌లో ఆరోపించిన ఆయన.. కాంగ్రెస్ పోటీలో లేదని చెప్పే కుట్ర నడుస్తుందని…
మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది… అయితే, ఈ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ప్రకటించాయి… కమ్యూనిస్టులకు చెప్పుకోదగిన ఓటింగ్ ఉండడంతో.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వారితో పొత్తుకోసం ప్రయత్నాలు చేశాయి.. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఓడించాలంటే.. టీఆర్ఎస్‌కే సాధ్యం.. అందుకే.. తమ మద్దతు.. గులాబీ పార్టీకేనని ప్రకటించాయి సీపీఎం, సీపీఐ.. అయితే, మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక విషయంలో చేసిన కామెంట్లను…