తెలంగాణలో రాజకీయాలు వేడిని రాజేస్తున్నాయి. త్వరలో మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. బీజేపీ నేతల పైన అక్రమ కేసులు పెడుతున్నారని, పార్టీ లో చేరిన వారిని భయపెడుతున్నారని మండిపడ్డారు బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి. ప్రత్యేక పోలీస్ పరిశీలకున్ని నియమించాలని కోరామన్నారు. ఉప ఎన్నిక వేళ అక్రమాలు జరిగే అవకాశం వుంది. అంబులెన్స్ వాహనాలను కూడా చెక్ చేయాలి. మునుగోడులో మద్యం ఏరులై పారుతుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి అని అధికారులను కోరాం అన్నారు ఇంద్రసేనా రెడ్డి.
Read Also: Chiranjeevi: మల్కాజిగిరి ఎంపీగా ఉపాసన.. చిరు ఏమన్నారంటే..?
కొత్త ఓటర్ లను నమోదు చేసుకోవడం ఇప్పుడు కుదరదు. నోటిఫికేషన్ కు వారం రోజుల ముందే ఓటర్ నమోదు చేయడానికి అనుమతి లేదు. ఈ నెల 8న ఫైనల్ ఓటర్ లిస్ట్ ఇస్తామని చెప్పారు. ఇంతకు ముందు ఉన్న ఓటర్ ల వివరాలను RTI ద్వారా సేకరించాం. తేడాలు ఉంటే ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు వెళ్తాం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లో ఓటర్ నమోదు కి అర్హత ఉన్న సంస్థల పేర్లు ఇవ్వాలన్నారు. మరోవైపు మునుగోడులో కొత్త ఓటర్ల నమోదు భారీగా పూర్తయింది. కొత్త ఓటర్ల నమోదుకు ఈరోజే చివరి తేదీ. ఇప్పటివరకు 26 వేలమంది కొత్త ఓటర్లు నమోదుచేసుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలో రెండు లక్షల 27 వేల మంది ఓటర్లు వుండగా.. కొత్త ఓటర్ల నమోదుతో భారీగా పెరగనున్నారు ఓటర్లు.
Read Also: Chiranjeevi: మల్కాజిగిరి ఎంపీగా ఉపాసన.. చిరు ఏమన్నారంటే..?