M. Kodandaram: మునుగోడు ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం, త్వరలో అభ్యర్థిని ప్రకటిస్తామని TJS అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో కేసీఆర్ కే కాదు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణ అసలు స్వరూపాన్ని వివరిస్తామని తేల్చిచెప్పారు. రాజగోపాల్ రెడ్డి ప్రత్యామ్నాయ రాజకీయాలు చూపిస్తామని, లక్షల కోట్లు కుమ్మరిస్తున్నారని అన్నారు. కృష్ణానది జిల్లాలో తెలంగాణ వాటా ఎంతో బీజేపీ తేల్చాలని ప్రశ్నలు కురిపించారు. రాజగోపాల్ రెడ్డి తన ప్రయోజనాలకు సంబంధించిన హామీని మాత్రమే బీజేపీ నుంచి పొందాడని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆశయాలను తాకట్టుపెట్టి మేమే ప్రత్యామ్నాయం అంటే నమ్మేదెట్లా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా అనుకున్న స్థాయిలో ప్రజల సమస్యలను చర్చించే ప్రయత్నం చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Mushroom Food : మష్రూమ్స్ తింటే ఇన్ని లాభాలా.. అయితే మీరు కూడా తెలుసుకోవాల్సిందే..!
మునుగోడు ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నామని, అభ్యర్థిని కూడా ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణ నుంచి జాతీయ నాయకుడు అవుతానని, కేసీఆర్ అసలు సమస్యల్ని పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ తన వైఫల్యాలలకు సమాధానం చెప్పాలని మండిపడ్డారు. చిన్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయలేక పోయింది ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ నియంత్రణలో నలుగురు చనిపోతే అసలు చర్చ లేకుండా పోయిందని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా పోయాయని అన్నారు. ఇలాంటి అంశాల మీద ఎన్నికల్లో చర్చ లేకుండా పోయిందని అన్నారు. ఎన్ని డబ్బులు ఇచ్చి ఓట్లు కొనాలనేదే పోటీగా మారిందని అన్నారు. భారత రాష్ట్ర సమితితో ఒరిగేదేమీ లేదని, పేరు మార్పిడి పెద్ద మోసమని అన్నారు. ఒకటో తేదీ జీతం ఇవ్వట్లేదు కేసీఆర్ అంటూ ఎద్దేవ చేశారు. మా జీవితంలో ఎప్పుడూ కూడా ఒకటి తర్వాత జీతం తీసుకోలేదని తీవ్ర విమర్శలు చేశారు.
Etela Rajender: నర్సాపూర్ లో ఈనెల 9న సభ.. బీజేపీలో భారీ చేరికలు ఉంటాయన్న ఈటెల