కోదండరాం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని టీపీసీసీ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సదర్భంగా.. జెండా ఆవిష్కరించి ఆయన పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. ఈకార్యక్రమం అనంతరం యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం పోర్లగడ్డ తండా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు అమ్ముడుపోతున్నారని మండిపడ్డారు. వాళ్ళకు గుణపాఠం చెప్పాలని, వాళ్ళను నిలదీయండని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్యాగాలు చేసిన కమ్యూనిస్టులు కలిసిరావాలని పిలుపు…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి.. అన్ని పార్టీల అగ్రనేతలు మునుగోడు బాట పడుతున్నారు.. తెలంగాణ సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇలా అగ్ర నేతలంతా మునుగోడు బాట పడుతున్నారు
Revanth Reddy Padayatra in Munugodu: స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజక వర్గంలో మన మునుగోడు, మన కాంగ్రెస్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున ఏర్పాటు చేసారు కాంగ్రెస్ శ్రేణులు. 175 గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర చేయాలని నిర్ణయించాయి. ఆరు మండలాలు, ఒక ప్రతిపాదిత మండల కేంద్రాల్లో జరిగే పాదయాత్రల్లో పీసీసీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని పొర్లుగడ్డతండాలో జరిగే పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. పాదయాత్ర సందర్భంగా మన మునుగోడు…
ఆగస్టు 21న మునుగోడుకి అమిత్ షా రానున్న సందర్భంగా.. షెడ్యూల్ లో స్వల్ప మార్పును బీజేపీ శ్రేణులు ప్రకటించారు. ఆగస్టు 21న మునుగోడు భారీ బహిరంగ సభ అనంతరం ఆయన ఢిల్లీకి వెల్లే తిరుగు ప్రయాణంలో స్వల్ప మార్పులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. మునుగోడు లో బహిరంగ సభ ముగిశాక రోడ్డు మార్గంలో ఫిల్మ్ సిటీ కి వెళ్లనున్న అమిత్ షా 6.45 నుండి 7.30 వరకు ఫిల్మ్ సిటీ లో బస చేయనున్నారు. 8 గంటల…
ఆగస్టు 21న మునుగోడులో బీజేపీ బహిరంగ సభ జరగనుందని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ వెల్లడించారు. ఈ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరవుతారని తెలిపారు. కేసీఆర్ పాలనలో జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడుతారన్నారు.
మునుగోడు కాంగ్రెస్ అడ్డా అని.. అక్కడ హస్తం పార్టీదే గెలుపు అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ప్రచారానికి వెళ్తానని ఆమె ప్రకటించారు. పెళ్లి కాదు.. పిలిస్తేనే వెళ్లాలి అనడానికి తప్పకుండా వెళ్లి కాంగ్రెస్‌ను గెలిపించుకుంటామన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. త్వరలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమక్షంలో అధికారికంగా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక, ఆయన ఎమ్మెల్యే రాజీనామాకు వెంటనే స్పీకర్ ఆమోదం తెలపడంతో.. ఉప ఎన్నికల అనివార్యం అయ్యింది.. అయితే, తన సిట్టింగ్ స్థానాన్ని మరోసారి గెలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా.. విజయం మాదంటే మాదేనంటూ బీజేపీ, టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.. ఇప్పటికే…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎపిసోడ్‌తో పాటు.. మునుగోడు ఉప ఎన్నికలు.. చండూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభ పెద్ద రచ్చగా మారిపోయింది.. తాజా పరిణామాలపై శుక్రవారం ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లగొట్టే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ వీడినందుకు తనను టార్గెట్ చేసి అవమానాలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎన్నో ఏళ్లుగా…