తెలంగాణలో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలు హాట్ టాపిక్. ఉప ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులు మిగిలి ఉంది. దీంతో.. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు వేగం పెంచాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ అయితే మంత్రులను, ఎమ్మెల్యేలను మునుగోడుకు పంపి ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నాలు వేగవంతం చేసింది.
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే! స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.