నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, ముంబై నగరాలను చేరాయి. రుతుపవనాల రాకతో రెండు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల కారణంగా దేశ రాజధాని, దేశ ఆర్థిక రాజధానిలో ఒకేసారి వర్షాలు కురవడం 62 ఏళ్లలో ఇదే తొలిసారి.
ముంబైలో వర్షాలు దంచికొడుతున్నాయి. శనివారం నుంచి మహానగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆదివారం ఘట్కోపర్ ప్రాంతంలో ఓ భవనంలో కొంతభాగం కుప్పకూలింది. దీంతో చాలా వరకు ఆస్తినష్టం వాటిల్లింది. అంతేకాకుండా శిథిలాల కింద ఆరుగురు చిక్కుకున్నారు. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నలుగురిని సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే వారిని ప్రథమ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు తెలుపుతున్నారు.
భారత దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గత 5 రోజులుగా వర్షాలు కురుస్తాయని.. భారత వాతావరణశాఖ హెచ్చరించిన కొన్ని గంటలకే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైతో పాటూ.. పుణె, నాగపూర్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 మధ్య.. కేవలం 3 గంటల్లో ముంబైలో 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
Adipurush : ఆదిపురుష్ సినిమా విడుదలైన తర్వాత కూడా రోజురోజుకు వివాదాలు ముదురుతున్నాయి. పెరుగుతున్న వివాదాలను దృష్టిలో ఉంచుకుని ఆ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్ ఆయన పూర్వీకుల నివాసం గౌరీగంజ్ వద్ద అధికారులు భద్రతను పెంచారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ట్రైడెంట్ హోటల్ బిల్డింగ్ నుంచి భారీగా పొగలు రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తాగితే మనసులోని నిజాలు బయటకు కక్కేస్తారంటే ఇదేనేమో.. లోనావాలాకు చెందిన అవినాష్ పవార్ అనే వ్యక్తి 1993లో ఒక వృద్ధ జంటను హత్యచేసి.. అనంతరం ఇంట్లో ఉన్న నగదు, బంగారం, విలువైన కొన్ని వస్తువులను దోచుకెళ్లాడు. అవినాష్ పరారీలో ఉండి 30 ఏళ్ళు కింగ్ లా బ్రతికాడు. ఏదైతే నిజం చెప్పకూడనది ఉందో.. ఆ నిజాన్ని ఓ ఫంక్షన్లో ఫుల్ గా తాగి ఆ మర్డర్ గురించి బయటకక్కేశాడు.
Mira Road : మీరారోడ్లో జరిగిన సరస్వతి వైద్య హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరస్వతి హత్యకు గురైన భవనంలోని ఏడో అంతస్తులో 35 శరీర భాగాలు లభ్యమయ్యాయి.
Unfriendliest Cities: కొత్తవారితో స్నేహం చేయాలనుకుంటున్నారా..? అయితే ముంబై, ఢిల్లీ నగరాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ముంబై, ఢిల్లీ నగరాలు ‘అన్ ఫ్రెండ్లీ సిటీ’ల జాబితాలో నిలిచాయి. కమ్యూనిటీ స్పిరిట్ ఇండెక్స్: వరల్డ్స్ ఫ్రెండ్లీఎస్ట్ సిటీస్ ఫర్ నాన్ నేటివ్స్ ప్రపంచంలోని 53 నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.
సెంట్రల్ ముంబైలోని ధారవి ప్రాంతంలో 26 ఏళ్ల వ్యక్తి తన పొరుగు వ్యక్తిని చంపి, అతని మృతదేహాన్ని బెడ్షీట్లో కప్పి, తన ఇంట్లో దాచిపెట్టాడని పోలీసులు సోమవారం తెలిపారు.