నైరుతి రుతుపవనాల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ముంబయిలో అయితే వర్షాలు ఆగకుండా కురుస్తూనే ఉన్నాయి.
శివసేన (యూబీటీ)కి చెందిన సామ్నా తన తాజా సంపాదకీయంలో రుతుపవనాల సన్నద్ధత, ముంబయిలో వరదల నిర్వహణపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించింది. అవినీతి కారణంగా నగరం మునిగిపోయిందని పేర్కొంది.
Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబైకి నీటి కష్టాలు తప్పేలా లేవు. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ముంబై మహానగరానికి నీరందించే అన్ని సరస్సుల్లో నీటిమట్టాలు అట్టడుగు స్థాయికి చేరాయి. దీంతో జూలై 1 నుంచి 10 శాతం నీటి కోత విధించాలని బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) నిర్ణయించింది. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని కమిషనర్ ఇక్బాల్ సింగ్ విజ్ఞప్తి చేశారు
మహారాష్ట్రలోని వివిధ పట్టణాలు, నగరాల పేర్లను మార్పు చేస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రతోపాటు ఉత్తర్ప్రదేశ్లో కూడా కొన్ని పట్టణాలను ఇప్పటి వరకు ఉన్న పేర్లతో కాకుండా ఆయా పట్టణాలకు పేర్లను మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి.
దేశంలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేసింది.
సాదారణంగా బండి మీద ఒకరు,ఇద్దరు, లేదా ముగ్గురు వెళ్లడం తరచు మనం చూస్తూనే ఉన్నాం కానీ తాజాగా ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఒక స్కూటర్పై ఏకంగా 8 మందిని తీసుకొని వచ్చాడు.. ఒక స్కూటర్పై ఏడుగురు పిల్లలతో ఒక వ్యక్తి రోడ్లపై చక్కర్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్గా మారింది.. ఆ వీడియో ను చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు.. విషయానికొస్తే.. మునావర్ షా అతని నలుగురు పిల్లలు, మరో ముగ్గురు పిల్లలు…
నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, ముంబై నగరాలను చేరాయి. రుతుపవనాల రాకతో రెండు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల కారణంగా దేశ రాజధాని, దేశ ఆర్థిక రాజధానిలో ఒకేసారి వర్షాలు కురవడం 62 ఏళ్లలో ఇదే తొలిసారి.
ముంబైలో వర్షాలు దంచికొడుతున్నాయి. శనివారం నుంచి మహానగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆదివారం ఘట్కోపర్ ప్రాంతంలో ఓ భవనంలో కొంతభాగం కుప్పకూలింది. దీంతో చాలా వరకు ఆస్తినష్టం వాటిల్లింది. అంతేకాకుండా శిథిలాల కింద ఆరుగురు చిక్కుకున్నారు. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నలుగురిని సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే వారిని ప్రథమ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు తెలుపుతున్నారు.
భారత దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గత 5 రోజులుగా వర్షాలు కురుస్తాయని.. భారత వాతావరణశాఖ హెచ్చరించిన కొన్ని గంటలకే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైతో పాటూ.. పుణె, నాగపూర్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 మధ్య.. కేవలం 3 గంటల్లో ముంబైలో 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.