ప్రతిపక్ష కూటమి 'ఇండియా'(ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) తన మూడో సమావేశాన్ని ఆగస్టు 15 తర్వాత లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ముంబైలో నిర్వహిస్తుందని కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే శుక్రవారం ప్రకటించారు.
దేశ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరోవైపు ముంబైలో రెండు రోజుల పాటు(శుక్ర, శని) ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావారణ శాఖ.
మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఓ గ్రామంపై కొండచరిచయలు విరిగిపడటంతో 13 మంది మరణించారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 100 మందికి పైగా చిక్కుకున్నారు. ఖలాపూర్ తహసీల్‌లోని ఇర్షాల్‌వాడి గ్రామంలోని ఇళ్లపై కొండ రాళ్లు, మట్టిపెళ్లలు పడటంతో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం 48 కుటుంబాలు చిక్కుకున్నాయి.
ముంబైలోని కొన్ని కుక్కలకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఏంటీ కుక్కలకు గుర్తింపు కార్డులా అని షాక్ అవుతున్నారా.. నిజమే. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీఎంసీ.. 20 వీధికుక్కలకు గుర్తింపు కార్డులను తయారు చేసి వాటి మెడలకు వేసింది.
Women Hides Huge Gold In Sanitary Pads in Mumbai: కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎంత నిఘా పెంచినా.. విదేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ ఏమాత్రం ఆగడం లేదు. బంగారంను అక్రమంగా తరలించేందుకు కొత్తకొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ భలే తెలివిగా గోల్డ్ స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి దొరికిపోయింది. ఏకంగా శానిటరీ ప్యాడ్స్‌లో బంగారాన్ని దాచి అక్రమ రవాణాకు ప్రయత్నించి.. కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కింది. ఈ…
ముంబైలోని మలాడ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మార్వే క్రీక్ లో ఐదుగురు బాలురు గల్లంతయ్యారు. అందులో ఇద్దరు బాలురులను స్థానికులు కాపాడారు. మిగితా ముగ్గురు గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టాలపై బాంబే హైకోర్టు సీరియస్ అయింది. చట్టాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవని వ్యాఖ్యానించింది. కొత్త చట్టాలు అతిగా ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేసింది.
Samosa: మహారాష్ట్రలోని ముంబైలో ఒక వైద్యుడిని కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన సమోసాలు కారణంగా పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నాడు. 25 ప్లేట్ల సమోసాల వ్యవహారంలో రూ.1.40 లక్షలు మోసపోయాడు.
Richest Beggar: బిచ్చమెత్తుకుంటూ రూ. 7.5 కోట్లు సంపాదించాడు ఓ వ్యక్తి. ప్రపంచంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన బిచ్చగాళ్ల జాబితాలో చేరారు. నెలకు రూ. 60 వేల నుంచి రూ.75 వేల వరకు సంపదిస్తూ ఈ ఖ్యాతి గడించాడు. అతను ఎవరో కాదు మన దేశానికి చెందిన భరత్ జైన్.