ముంబై ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ ను అధికారులు సీజ్ చేశారు..కొరియర్ టెర్మినల్‌లో కోస్టారికాకు చెందిన చెక్క వస్తువుల నుండి 5 కోట్ల రూపాయల విలువైన 500 గ్రాముల కొకైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకుంది..ఈ కేసులో ఓ మహిళ సహా ఇద్దరిని అరెస్టు చేశారు. జూన్ 28న డీఆర్‌ఐ ముంబై జోనల్ యూనిట్ ఈ సరుకును స్వాధీనం చేసుకుంది. కొకైన్‌ను చెక్క వస్తువుల్లో ఉంచారు.. అధికారులకు చిక్కకుండా ఉండేందుకు డ్రగ్స్ ను చెక్క వస్తువులలో ఉంచినట్లు అధికారులు గుర్తించారు..
మొత్తం 56 పౌచ్‌లలో రూ.5 కోట్ల విలువైన 500 గ్రాముల కొకైన్ ఉంది. అందులో మొబైల్ నంబర్ రాసి ఉండడం కనిపించింది. DRI బృందం మొబైల్ నంబర్‌కు కాల్ చేయగా, అది ఒక అమ్మాయి చేత తీయబడింది.. వారిని తనిఖీలు చేసిన అధికారులు మరింత సమాచారం కోసం వారి నుంచి వివరాలను సేకరించారు.. అంతేకాదు.. కొన్ని ఫోన్ నెంబర్స్ ను కూడా సంపాదించేశారు..ఫోన్ తీసుకున్న వ్యక్తి ఈ పార్శిల్ తీసుకోవడానికి అంగీకరించాడు. అనంతరం సరుకు తీసుకునేందుకు రాగా పట్టుబడ్డాడు. ప్రశ్నించిన తర్వాత.. అతని మహిళా సహోద్యోగిని కూడా అరెస్టు చేశారు. నిందితులిద్దరి మొబైల్ ఫోన్ డేటాలో ఇందుకు సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.. ఈ మొత్తం డ్రగ్స్ విలువ రూ.14 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు సీజ్ చేశారు..
గతంలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రెండు కిలోలకు పైగా హెరాయిన్‌తో ఓ విదేశీ మహిళ పట్టుబడింది. రికవరీ చేసిన హెరాయిన్ విలువ దాదాపు రూ.14 కోట్లు ఉంటుందని సమాచారం. ఆమె జూలై 2న కెన్యా నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. ప్రయాణికురాలి బ్యాగేజీని తనిఖీ చేయగా అందులో కొన్ని ప్యాకెట్లు కనిపించాయని కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ తెలిపింది..అనుమానం రావడంతో ప్రయాణికురాలి బ్యాగేజీని తనిఖీ చేయగా అందులో కొన్ని ప్యాకెట్లు కనిపించాయని కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. వాటిని తెరవగా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.. ఇలాంటి వాటిపై అధికారులు ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపుతున్న ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వడం తో అధికారులు మరింత అలెర్ట్ అవుతున్నారు..