ప్రపంచంలో మానవులకు, కుక్కలకు మధ్య సంబంధం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే కుక్కలు మానవుడు చెప్పినట్టుగా విశ్వాసంగా ఉంటాయి. అంతేకాకుండా కుక్కను పెంచుకోవడం వల్ల ఇంకో మనిషితో ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది. కొందరు కుక్కలంటే ఇష్టపడతారు. మరికొందరికి అవంటే అస్సలు పడదు. ఎందుకంటే కుక్కలు వారి జీవితంలో ఎప్పుడైనా భయపెట్టినా గానీ, బెదిరించినా గానీ వాటిపై అసహ్యం పెంచుకుంటారు. ఇక వీధికుక్కలనైతే రాళ్లు, కట్టెలతో కొడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు వీధికుక్కలకు సంబంధించిన ఓ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై కొందరు ఆశ్చర్యపోతుండగా మరి కొందరు ప్రశంసిస్తున్నారు.
Padi Kaushik Reddy: ఈటల రాజేందర్‌కి ఎమ్మెల్సీ కౌశిక్ సూటి ప్రశ్న.. సమాధానం చెప్పాలని డిమాండ్
విషయానికొస్తే.. ముంబైలోని కొన్ని కుక్కలకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఏంటీ కుక్కలకు గుర్తింపు కార్డులా అని షాక్ అవుతున్నారా.. నిజమే. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీఎంసీ.. 20 వీధికుక్కలకు గుర్తింపు కార్డులను తయారు చేసి వాటి మెడలకు వేసింది. అంతే కాకుండా వాటికి ఎయిర్ పోర్ట్ లోని టెర్మినల్ 1 వెలుపల టీకాలు కూడా వేశారు. అందువల్ల వాటి నుండి ప్రజలకు ఎటువంటి ప్రమాదం ఉండదు.
హాట్‍లుక్స్ తో హీటెక్కిస్తున్న కృతి శెట్టి
అంతేకాకుండా ఆ గుర్తింపుకార్డులో ఓ స్కానర్‌ను అమర్చారు. అందులో ఆ కుక్కకు సంబంధించిన అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉంటుంది. ఆ QR కోడ్‌ని స్కాన్ చేస్తే.., ఆ కుక్క పేరు, దానికి టీకాలు వేసారా లేదా.. ఎప్పుడు వేస్తారనేది తెలుస్తుంది. అంతే కాకుండా.. స్టెరిలైజేషన్ నుండి వైద్య వివరాలు కూడా ఆ స్కానర్‌లో ఉంటాయి. ‘pawfriend.in’ అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెబుతున్నారు. అక్షయ్ రిడ్లాన్ అనే ఇంజనీర్ ఈ కార్యక్రమం చేపట్టాడు. కుక్కల కోసం తయారు చేసిన గుర్తింపు కార్డు ప్రయోజనాన్ని వివరిస్తూ.. ఏదైనా జంతువు ఎక్కడైనా తప్పిపోయినట్లయితే.. క్యూఆర్ కోడ్ సాయంతో అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవచ్చునని చెప్పారు.