సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్ర కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. మరో కీలక నేత కమలం గూటికి చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాషాయ గూటికి చేరారు.
ముంబై మలాడ్ ఈస్ట్‌లోని వర్దమాన్ గార్మెంట్ షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని 8 ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగు చూసింది. ముంబయిలోని మాల్వానీ ప్రాంతంలో రుతుక్రమం గురించి అవగాహన లేని ఓ మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మొదటి సారి పీరియడ్‌తో ఒత్తిడికి లోనైన ఆమె కేవలం 14 ఏళ్ల వయసులోనే ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
మాయానగరి ముంబైలో నిర్మించిన జియో వరల్డ్ గార్డెన్ ఎంతో ప్రసిద్ధి చెందింది. దీని యజమాని దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ. ఈ గార్డెన్ 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. చెరువులు, మాల్స్, థియేటర్లు, గార్డెన్‌లోని పచ్చదనం దాని అందాన్ని మరింత పెంచుతాయి. ఇందులో ఇప్పటికే పలు పెద్ద కార్యక్రమాలు నిర్వహించారు.
Hurun rich list: హురన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులు అమెరికాలోని న్యూయార్క్‌లోనే నివసిస్తున్నారు. అయితే, ఆసియాలో మాత్రం బిలియనీర్లకు కేంద్రంగా ముంబై తొలిస్థానంలో ఉంది. చైనా రాజధాని బీజింగ్‌ని వెనక్కి నెట్టి ముంబై ఈ ఘనత సాధించింది
ఆసియా బిలియనీర్ క్యాపిటల్‌గా తొలిసారి భారత ఆర్థిక రాజధాని ముంబై నిలిచింది. ముంబైలో మొత్తం 92 మంది బిలియనీర్లు మాత్రమే ఉండగా.. ఈ సంఖ్య బీజింగ్‌లో 91గా ఉంది.
Drug Network: తెలంగాణ క్రమక్రమంగా డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోంది. పంజాగుట్ట పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు. దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ లింకును పోలీసులు ఛేదించారు.
ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, ఆ ఇంటి నుంచి మంచి వ్యూ ఉండాలని కోరుకుంటారు. ఇక ధనికులైతే లేక్‌వ్యూ, సీ వ్యూ ఉండేలా కోట్లు వెచ్చించి ఇంటిని నిర్మించుకుంటారు. ఆ కోవలోనే రేఖా ఝున్‌జున్‌వాలా తన ఇంటి నుంచి అరేబియా సముద్రాన్ని చూసేందుకు రూ.118 కోట్లు ఖర్చు చేసింది.
Pradeep Sharma: 2006లో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ సన్నిహితుడు రామ్‌నారాయణ్ గుప్తా బూటకపు ఎన్కౌంటర్ కేసులో మాజీ పోలీసు ప్రదీప్ శర్మను దోషిగా నిర్ధారించి బాంబే హైకోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. జస్టిస్ రేవతి మోహితేదేరే, గౌరీగాడ్సేలతో కూడిన డివిజన్ బెంజ్ ‘ఫేక్ ఎన్కౌంటర్’ కేసులో ఆయనను దోషిగా తేల్చింది. ఈ కేసులో సెషన్స్ కోర్టు 2013లో ప్రదీప్ శర్మ నిర్దోషి అని చెప్పిన తీర్పును హైకోర్ట్ తప్పుపట్టింది.