Mumbai: ముంబైలో గాలి దుమారం.. ఈ సీజన్లో ఇదే మొదటి వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. అంతేకాకుండా.. భారీ వర్షం కురిసింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో.. ముంబై వాసులు వేడి నుండి ఉపశమనం పొందారు. కాగా.. ఈ సీజన్‌లో ముంబైలో ఇది మొదటి వర్షపాతం కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. మెట్రోపాలిటన్ యొక్క స్కైలైన్ మురికి గాలులతో చుట్టుముట్టింది. దీంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.
Read Also: Rahul Gandhi: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న రాహుల్ గాంధీ..?
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
ముంబైలోని ఘట్‌కోపర్, బాంద్రా కుర్లా, ధారవి ప్రాంతంలో బలమైన గాలులు వీస్తూ వర్షం పడింది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటైన ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్ మరియు టేకాఫ్ కార్యకలాపాలు తదుపరి నోటీసు వచ్చేవరకు నిలిపివేయబడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. రానున్న 3-4 గంటల్లో పాల్ఘర్, థానే జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులతో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Read Also: AP Elections 2024: చివరి గంటల్లో పోలింగ్.. ఈసీ ప్రత్యేక దృష్టి..
ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. నవీ ముంబైలోని అరోలి సెక్టార్ 5 ప్రాంతంలో రద్దీగా ఉండే రహదారిపై ఓ భారీ వృక్షం పడిపోయింది. ఈ సమయంలో ఎవరూ ప్రయాణించికపోవడంతో ముప్పు తప్పింది. కాగా.. నగరంలో భారీ గాలులు వీస్తుండటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.
తాజావార్తలు
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!