Dabbawala service: లండన్ లోనూ ‘డబ్బావాలా’.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు ఆయన నెటిజన్లతో తనకు ఇష్టమైన, స్ఫూర్తిదాయకమైన వీడియోలను పంచుకుంటారు. ఇకపోతే ఆయన చేసిన తాజా పోస్ట్ వైరల్ అయ్యింది. ముంబై లోని డబ్బావాలా ఫుడ్ డెలివరీ సిస్టమ్ నుండి ప్రేరణ పొందింది ఓ ఫుడ్ డెలివరీ స్టార్టప్. ఇందుకీ సంబంధించి లండన్ లో ప్రారంభించిన ఫుడ్ డెలివరీ స్టార్టప్ గురించి వీడియోను ఆయన పోస్ట్ చేసారు. ముంబయి లోని డబ్బావాలాలు ఉదయం పూట ఆఫీసులకు, పాఠశాలలకు వెళ్లే వారి కోసం ఇంటి నుంచి ప్యాక్ చేసిన లంచ్ లను సేకరించి లంచ్ టైమ్ లో ఆఫీసులకు, స్కూళ్లకు అందజేస్తున్నారు.
Also Read: Amit Shah: హెలికాప్టర్ లోపం.. అమిత్ షాకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..
Also Read
లండన్ లోని కొంతమంది వ్యాపారవేత్తలు డబ్బావాలా ఉదాహరణ ఆధారంగా డెలివరీ స్టార్టప్ ను స్థాపించారు. ఆహారాన్ని ప్యాక్ చేయడానికి వారు స్టీల్ డబ్బాలను ఉపయోగిస్తారు. ఇందులో పనీర్ సబ్జీ, మిక్స్‌డ్ రైస్, కూరగాయలు ఉపయోగించి చేసే వెజ్ ఐటమ్స్ వంటి భారతీయ వంటకాలను తయారు చేసిన ఆర్డర్ లను స్వయంగా వాటిని గుడ్డలో చుట్టి., కార్గో బైక్ లపై డెలివరీ చేస్తారు. మహీంద్రా ఈ వీడియోను ‘‘రివర్స్ కాలనైజేషన్ అవుతుందని చెప్పడానికి ఇంతకంటే మెరుగైన, ‘రుచికరమైన’ సాక్ష్యం లేదు’’ క్యాప్షన్ తో షేర్ చేసారు.
Also Read: ATM Blast: ఏటీఎంలో చోరీకి ప్రయత్నం.. షార్ట్ సర్క్యూట్ దెబ్బకి..
భారత్‌కు చెందిన ఓ స్టార్టప్ కు లండన్‌లో గుర్తింపు లభించడం, స్థానికుల నుంచి మద్దతు లభించడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియోకు అనేక కామెంట్స్ వస్తున్నాయి. ఇందులో ఒకరు ఇది వలసవాదమా లేక వ్యాపారావకాశమా..? అని అనగా.. మరో నెటిజన్ స్పందిస్తూ.. భూమిని ప్లాస్టిక్ భూతాన్ని రక్షించడమే ఏకైక పరిష్కారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
No better—or more ‘delicious’—evidence of reverse colonization!
— anand mahindra (@anandmahindra) April 28, 2024
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!