Mumbai: రూ.200 చికెన్ షాపు బిల్లుపై ఘర్షణ.. సీఎంవో ప్యూన్ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో దారుణం జరిగింది. రూ.200 చికెన్ బిల్లుపై ఘర్షణ చోటుచేసుకోగా.. ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న ప్యూన్ (30) హత్యకు గురయ్యాడు. మరొకరు గాయాలు పాలయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Sandeshkhali: సందేశ్‌ఖాలీ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థికి భారీ భద్రత
Also Read
- Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
- North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
ముంబైలోని ములుంద్ ప్రాంతంలోని చికెన్ షాపులో బిల్లు చెల్లించే విషయంలో గొడవ జరిగింది. ఇమ్రాన్ ఖాన్(27) అతని సోదరుడు సలీం ఖాన్ (29), మరో ముగ్గురు కలిసి రాడ్లు, పదునైన ఆయుధాలతో అక్షయ్ నర్వేకర్, ఆకాష్ సాబ్లేపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలికి చేరుకుని బాధితుల్ని ఆస్పత్రికి తరలించగా.. నర్వేకర్ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. మృతుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్యూన్‌గా పని చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆదివారం ఉదయం ఆకాష్ సాబ్లేతో కలిసి నర్వేకర్ చికెన్ షాపు దగ్గరకు వెళ్లారు. బిల్లు విషయంలో స్వల్ప ఘర్షణ జరిగింది. తిరిగి రాత్రి మళ్లీ చికెన్ షాపు దగ్గరకు రావడంతో.. అది కాస్తా ముదిరి కొట్టుకునే దాకా వెళ్లింది. ఈ దాడుల్లో నర్వేకర్ మృతిచెందాడు. ఐదుగురు నిందితుల్ని పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. మే 8 వరకు పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. నిందితుల్ని నుంచి సమాచారం రాబట్టనున్నారు.
ఇది కూడా చదవండి: Amit Shah : అమిత్ షా ఫేక్ వీడియో.. తెలంగాణ కాకుండా మరో రెండు రాష్ట్రాల్లో దర్యాప్తు
తాజావార్తలు
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
-
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
-
Medico Priyanka : కిమ్స్‌లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
-
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్‌ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!