ఆర్థిక రాజధాని ముంబైలో ఒక్కసారిగా వాతావరణం ఛేంజ్ అయిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. మరోవైపు భారీ ధూళి తుఫాన్ నగరాన్ని కమ్మేసింది. దీంతో ఒక్కసారిగా వాహనదారులు, ప్రజలు ఏం జరుగుతుందో అర్థంకాక… భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుంతో తెలియక రోడ్లపై వాహనాలు నిలిపివేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: Bomb Threat: ‘అమాయకుల రక్తం చిందిస్తాం’.. బెంగళూరులోని 6 ఆసుపత్రులకు బాంబు బెదిరింపు
సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ధూళితో కూడిన తుఫాన్ ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీంతో వాహనదారులు.. తలదాచుకునేందుకు ప్రయత్నించగా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ఓ వైపు ధూళి తుఫాన్.. ఇంకోవైపు భారీ వర్షంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ముంబైలోని ఘట్‌కోపర్, బాంద్రా కుర్లా, ధారవి ప్రాంతంలో బలమైన గాలులు, వర్షం పడింది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఆస్తి, ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? అన్నదానిపై క్లారిటీ రావల్సి ఉంది.
ఇది కూడా చదవండి: PM Modi: పాట్నా గురుద్వారాలో సిక్కు వేషధారణతో సేవ చేసిన మోడీ