నిరసనల నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లారు.. మహ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టినా.. దేశంలో ప్రజల ఆగ్రహం చల్లారడం లేదు. బంగ్లాదేశ్లో విద్యార్థులతో సహా ప్రజలు మళ్లీ వీధుల్లోకి వచ్చారు.
షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చేశాక... మైనారిటీలు, హిందువులపై దాడులు పెరిగిపోయాయి. దీంతో దాడులపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోడీకి ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఫోన్ కాల్ చేశారు.
ఇదిలా ఉంటే, తనపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో హిందువులు సంఘటితమయ్యారు. రాజధాని ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ నేపధ్యంతో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహమ్మద్ యూనస్ ఈ రోజు హిందూ నాయకులను కలుసుకున్నారు. మంగళవారం ఢాకాలోని ఢాకేశ్వరి జాతీయ ఆలయాన్ని సందర్శించిన తర్వాత ప్రజలు ఓపికతో మెలగాలని, ఐక్యత కోసం పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరికి మతంతో సంబంధం లేకుండా హక్కులు ఉన్నాయని అన్నారు.
బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసిన విద్యార్థి సంఘాలను తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ ప్రశంసలతో ముంచెత్తారు. ఎలాంటి సందేహం లేదు... విద్యార్థుల నేతృత్వంలోని విప్లవం కారణంగా హసీనా ప్రభుత్వం కుప్పకూలిందని ఆదివారం రాత్రి విద్యార్థులతో సమావేశం అనంతరం యూనస్ విలేకరులతో అన్నారు.
PM Modi: షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్లో నోబెల్ విజేత ముహమ్మద్ యూనస్ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఈ రోజు ఏర్పాటు చేశారు. బాధ్యతలు స్వీకరించిన యూనస్కి ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్లో త్వరగా సాధారణ స్థితికి రావాలని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
షేక్ హసీనా ప్రధానిగా 15 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
Bangladesh Political Crisis: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహ్మద్ యూనస్ గురువారం మధ్యాహ్నం 2:10 గంటలకు బంగ్లాదేశ్ చేరుకుంటారు.
Muhammad Yunus: నోబెల్ విజేత ముహ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నట్లు తెలుస్తోంది. తాను ప్రభుత్వానికి సారథ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా తర్వాత ఆర్మీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ దేశ ఆర్మీ చీఫ్ ప్రకటించారు.