బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలపై తాత్కాలిక ప్రభుత్వ నాయకుడు, నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు. 2025 చివరలో లేదా 2026 ప్రథమార్థంలో ఎన్నికలు నిర్వహిస్తామని సోమవారం తెలిపారు. ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా తయారీల ఆధారంగా ఎన్నికల తేదీని నిర్ణయిస్తామని చెప్పారు. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ 53వ వార్షికోత్సవం సందర్భంగా యూనస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా తయారీ ఆధారంగా సార్వత్రిక ఎన్నికల తేదీని నిర్ణయిస్తాం. ఎన్నికల ప్రక్రియకు కనీసం…
India- Bangladesh: బంగ్లాదేశ్‌లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పర్యటించారు. ఈ సందర్భంగా బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో యూనస్, మిస్రీల మధ్య 40 నిమిషాల పాటు చర్చ జరిగింది.
Nobel Prize: బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత, నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్‌కి ఇచ్చిన అవార్డుని సమీక్షించాలని కోరుతూ.. బెంగాల్ బీజేపీ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహతో శుక్రవారం నార్వేజియన్ నోబెల్ కమిటీకి లేఖ రాశారు. ఆయన హయాంలో బంగ్లాదేశ్ హిందువుల, ఇతర మైనారిటీలపై జరుగుతున్న తీవ్ర అఘాయిత్యాలు, అకృత్యాలను పరిష్కరించాలని మహతో తన లేఖలో నోబెల్ కమిటీని కోరారు.
Bangladesh-Pakistan: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా పదవి కోల్పోయిన తర్వాత పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు చిగురిస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ కరాచీ నుంచి బంగ్లాదేశ్ చిట్టగాంగ్ పోర్టుకు ఒక కార్గో షిప్ వెళ్లింది. ఇది పాక్-బంగ్లాల మధ్య తొలి సముద్ర సంబంధంగా పేర్కొనబడుతోంది. ఢాకాలోని పాకిస్తాన్ హైకమిషన్ "ద్వైపాక్షిక వాణిజ్యంలో ఒక ప్రధాన అడుగు"గా అభివర్ణించింది, ఈ అభివృద్ధి రెండు దేశాల మధ్య చారిత్రాత్మకంగా బలహీనమైన సంబంధాలలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఏదో జరుగుతోంది.. రానున్న కొన్ని రోజుల్లో బంగ్లా రాజకీయాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత షేక్ హసీనా తనను తాను ప్రధానిగా సంభోదిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. మరోవైపు ట్రంప్ గెలవడం ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌కి పెద్ద తన నొప్పిగా మారింది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడంతో బంగ్లాదేశ్‌లో అసలు గేమ్ ప్రారంభం కాబోతోంది. ట్రంప్ గెలిచిన వెంటనే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, తనను ప్రధానిగా పేర్కొంటూ శుభాకాంక్షలు చెప్పింది. ఈ పరిణామం ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వానికి క్లియర్ మేసేజ్‌గా చెప్పవచ్చు. నిజానికి ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ ట్రంప్‌కి గతం నుంచి గ్యాప్ ఉంది. ట్రంప్‌ని గట్టిగా విమర్శించే వ్యక్తుల్లో మహ్మద్ యూనస్ ఒకరు. మహ్మద్ యూనస్ ప్రస్తుతం…
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ సవరణకు పూనుకుంది. ఇందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసింది. దేశ రాజ్యాంగాన్ని సమీక్షించడానికి, సరిచేయడానికి, సంస్కరణలను సిఫార్సు చేయడానికి తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది.
బంగ్లాదేశ్‌కు మహ్మద్ యూనస్ నాయకత్వం వహించినప్పటి నుంచి పలు మార్లు హిందువులను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. ఇటీవల వరదలకు భారత్ కారణమని నిందించినట్లు సమాచారం.
బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం ఆమె భారత్‌కు వచ్చి తలదాచుకుంటుంది. అనంతరం నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.
Bangladesh Reform: షేక్ హసీనాను అధికారం నుండి తొలగించిన తరువాత, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉన్న మహ్మద్ యూనస్ దేశంలో మార్పు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.