Bangladesh New Govt: బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పడబోయే మధ్యంతర ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనుస్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ గ్రహీత ఆర్థికవేత్త డాక్టర్ ముహమ్మద్ యూనస్‌కు న్యాయస్థానం సోమవారం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. యూనస్ మద్దతుదారులు ఈ సంఘటనను "రాజకీయ ప్రేరణ"గా అభివర్ణించారు. ఇదిలా ఉంటే.. 83 ఏళ్ల ఆర్థికవేత్త ముహమ్మద్ యూనస్ తన పేదరిక వ్యతిరేక ప్రచారానికి 2006లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. ఈ ప్రచారం బంగ్లాదేశ్‌కు 1983లో స్థాపించిన గ్రామీణ బ్యాంకు ద్వారా మైక్రోక్రెడిట్‌కు నిలయంగా పేరు తెచ్చుకుంది.