ముడా స్కామ్ వ్యవహారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ముడా వివాదానికి సంబంధించి సీఎంపై ఈడీ కేసు నమోదు చేయడంతో.. ఆయన భార్య పార్వతి సంచలన నిర్ణయం తీసుకుంది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మైసూరు లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లాట్ల కేటాయింపులో కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
MUDA Land Scam: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) ల్యాండ్ స్కామ్ కన్నడ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతికి ఈ స్కామ్‌లో ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. మైసూర్ నగరాభివృద్ధికి పార్వతి నుంచి సేకరించిన భూమి విలువ కన్నా,
MUDA land Scam: ముడా ల్యాండ్ స్కాం నేపథ్యంలో కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు కర్ణాటక హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంచలనంగా మారింది. ఈ కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో దీనిపై సీబీఐ విచారణ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు సిద్ధరామయ్య పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్…
MUDA land scam: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్(ముడా) ల్యాండ్ స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గతంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆయనపై విచారణకు ఆదేశాలు ఇవ్వడాన్ని సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టులో సవాల్ చేశారు. అయితే, సీఎం పిటిషన్‌ని నిన్న కర్ణాటక హైకోర్టు కోట్టేసింది. దీంతో విచారణకు మార్గం సుగమమైంది. ఇదిలా ఉంటే ట్రయల్ కోర్ట్ సీఎంపై కేసు నమోదు చేసి, విచారణ జరపాలని లోకాయుక్తాని ఈ రోజు ఆదేశించింది.
MUDA land scam: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ ఇచ్చింది. ముడా ల్యాండ్ స్కాంలో సీఎంపై గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ విచారణకు ఆదేశించారు. అయితే, దీనిని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ రోజు దీనిపై న్యాయమూర్తి జస్టిస్ నాగ ప్రసన్నతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించారని, వాస్తవాలు వెలుగులోకి రావాలి’’ అని, సిద్ధరామయ్య పిటిషన్‌ని…
Karnataka: ముడా భూ కుంభకోణం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ముడా స్కామ్‌లో సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. అయితే, దీనిని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించిన సిద్ధరామయ్యకు బిగ్ షాక్ తగిలింది. ‘‘ ఈ కేసులో గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించారని, వాస్తవాలు వెలుగులోకి తేవాలి’’ అని హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ నాగ ప్రసన్న అన్నారు. సిద్ధరామయ్య వేసిన పిటిషన్‌ని కొట్టేశారు.