MUDA land Scam: సీబీఐకి అనుమతి నిరాకరణ.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- సీబీఐకి సమ్మతిని విత్ డ్రా చేసుకున్న కర్ణాటక ప్రభుత్వం..
- బీజేపీ డిమాండ్ నేపథ్యంలో కేబినెట్ కీలక నిర్ణయం..
- ముడా స్కామ్‌లో సిద్ధరామయ్యపై విచారణకు కోర్టు ఆదేశం..
- సీబీఐతో దర్యాప్తు చేయాలని బీజేపీ డిమాండ్..
- ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విచారణకు సీబీఐకి నిరాకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MUDA land Scam: ముడా ల్యాండ్ స్కాం నేపథ్యంలో కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు కర్ణాటక హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంచలనంగా మారింది. ఈ కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో దీనిపై సీబీఐ విచారణ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు సిద్ధరామయ్య పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, సీబీఐతో దర్యాప్తు చేయాలనే డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో సీబీఐ దర్యాప్తు అనుమతి ఇస్తూ గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ని ఉపసంహరించుకోవాలని కర్ణాటక క్యాబినెట్ గురువారం నిర్ణయం తీసుకుంది. సీఎం సిద్ధరామయ్యకు ఈ కేసులో ఉచ్చుబిగిస్తున్న సమయంలో ఈ నిర్ణయం వచ్చింది.
Also Read
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
Read Also: Home Minister Anitha: ముంబయి నటి కేసు.. తప్పు చేసిన ఎవర్ని వదిలే ప్రసక్తే లేదు..
ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం, రాష్ట్రంలో నేర పరిశోధనలను స్వేచ్ఛగా నిర్వహించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థకు ప్రభుత్వం గతంలో అనుమతి ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టం కింద ముఖ్యమంత్రిపై దర్యాప్తు ప్రారంభించే అవకాశం ఉన్న సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా సీబీఐ విచారణను నిరోధించడానికి క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
CBI ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ (DPSEA) కింద పనిచేస్తుంది, ఇది ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగంగా పేర్కొనబడుతుంది. ఫలితంగా సీబీఐ వేరే రాష్ట్రాల్లో పరిశోధన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి అవసరం. సీబీఐ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం తన సమ్మతిని ఉపసంహరించుకోంటుందని మంత్రి హెచ్‌కే పాటిల్ చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!