Siddaramaiah: ముడా స్కామ్ వ్యవహారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ముడా వివాదానికి సంబంధించి సీఎంపై ఈడీ కేసు నమోదు చేయడంతో.. ఆయన భార్య పార్వతి ఈరోజు (సోమవారం) ఓ లేఖను రిలీజ్ చేసింది. అందులో అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న ఈ 14 ప్లాట్లను తిరిగి ‘ముడా’కు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక, దీనిపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు.
Read Also: Prakash Raj: పవన్ ను ఇంకా వదలని ప్రకాష్ రాజ్.. పంగనామాలంటూ మరో ట్వీట్
కాగా, రాజకీయ విద్వేషాలు, కుట్రలకు తన భార్య బాధితురాలయ్యారని సీఎం సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నా.. ముడా స్థలాల కేటాయింపులో భాగంగా మాకు వచ్చిన భూములను నా భార్య తిరిగిచ్చేసింది అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు తప్పుడు కంప్లైంట్స్ చేసి నా కుటుంబాన్ని వివాదంలోకి లాగారని మండిపడ్డారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు.. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలన్నదే నా సిద్ధాంతం అని సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు.
Read Also: MUDA Scam: ముడా స్కామ్లో కీలక పరిణామం.. భూమిని తిరిగి ఇచ్చేస్తానన్న సీఎం భార్య..
ఇక, నాపై జరుగుతున్న ఈ రాజకీయ కుట్రలు చూసి నా భార్య పార్వతి ఆవేదన చెందిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. అందుకే, ఈ భూములను తిరిగి ఇవ్వాలని ఆమె నిర్ణయం తీసుకుంది.. ఇది తనకు ఆశ్చర్యం కలిగించినప్పటికీ ఆమె నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని అన్నారు. నాలుగు దశాబ్దాల నా రాజకీయాల్లో ఎలాంటి జోక్యం చేసుకోలేదు.. కుటుంబ బాధ్యతలకే నా భార్య పరిమితమైంది.. ఇప్పుడు ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలకు గురై తాను మానసిక క్షోభను అనుభవిస్తోందని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.