ముడా స్కామ్ వ్యవహారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ముడా వివాదానికి సంబంధించి సీఎంపై ఈడీ కేసు నమోదు చేయడంతో.. ఆయన భార్య పార్వతి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈరోజు (సోమవారం) ఓ లేఖను రిలీజ్ చేసింది. అందులో అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న ఈ 14 ప్లాట్లను తిరిగి ‘ముడా’కు ఇచ్చేస్తున్నట్లు వెల్లడించింది.
Read Also: Komatireddy Venkat Reddy: మూసి ప్రక్షాళనను అడ్డుకుంటే ప్రత్యేక ఉద్యమం చేస్తాం..
అలాగే, మా అన్నయ్య పసుపు కుంకుమల కింద ఇచ్చిన ఈ ప్లాట్లు ఇంత రాద్దాంతం చేస్తాయని తాను ఊహించలేదు కన్నడ సీఎం సతీమణి పార్వతి తెలిపింది. నా భర్త గౌరవం, ఘనతకు మించి ఈ ఆస్తులు పెద్దవి ఏం కాదని చెప్పుకొచ్చింది. ఇన్నాళ్లు ఆయన అధికారం నుంచి తాము ఏమీ ఆశించలేదు.. మాకు ఈ ఆస్తులు తృణప్రాయం. అందుకే ఈ స్థలాలను తిరిగి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కు (ముడా) అప్పగిస్తున్నాను అని ప్రకటించింది. ఈ విషయంలో నా భర్త అభిప్రాయం ఏంటో నాకు తెలియదు.. నా కుటుంబ సభ్యులతోనూ చర్చించకుండా నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం ఇది అన్నారు.
Read Also: Adani Group: అదానీ, కెన్యా మధ్య ‘రహస్య’ ఒప్పందం.. బహిర్గతం చేసిన వ్యక్తికి ప్రాణహాని!
ఇక, ఈ ఆరోపణలు వచ్చిన రోజే ఈ నిర్ణయం తీసుకోవాలనుకున్నాను.. కానీ, నా భర్త రాజకీయ కుట్రలో మరింత నష్టపోతున్నాడని తెలిసి ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నాను అని సిద్ధరామయ్య భార్య పార్వాతి పేర్కొనింది. అవసరమైతే దర్యాప్తునకు కూడా సహకరిస్తాను.. రాజకీయ రంగానికి దూరంగా ఉండే నాలాంటి ఆడవాళ్లను వివాదాల్లోకి లాగొద్దని ఆమె ఆ లేఖలో ప్రస్తావించింది. మరోవైపు, ఈ పరిణామాలపై ముడా కమిషనర్ రియాక్ట్ అయ్యారు. ముడా ఆస్తులను ఎవరైనా వెనక్కి ఇచ్చేస్తే తాము తీసుకుంటాం.. దీనిపై అందరితో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు.