MUDA land scam: ముడా స్కామ్‌లో భయపడేది లేదు.. కోర్టు ఆదేశంపై సిద్ధరామయ్య
- నేను భయపడను.. న్యాయపరమైన విచారణకు సిద్ధం..
- ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు..
- సీఎంపై కేసు నమోదు చేసి..దర్యాప్తుకు ఆదేశించిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MUDA land scam: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్(ముడా) ల్యాండ్ స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గతంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆయనపై విచారణకు ఆదేశాలు ఇవ్వడాన్ని సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టులో సవాల్ చేశారు. అయితే, సీఎం పిటిషన్‌ని నిన్న కర్ణాటక హైకోర్టు కోట్టేసింది. దీంతో విచారణకు మార్గం సుగమమైంది. ఇదిలా ఉంటే ట్రయల్ కోర్ట్ సీఎంపై కేసు నమోదు చేసి, విచారణ జరపాలని లోకాయుక్తాని ఈ రోజు ఆదేశించింది.
Read Also: Labanon: లైవ్‌లో ఉండగా జర్నలిస్టుపై పడ్డ ఇజ్రాయెల్ క్షిపణి.. వీడియో వైరల్
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ఈ నేపథ్యంలో విచారణకు తాను భయపడబోయేది లేదని సిద్ధరామయ్య ఈ రోజు అన్నారు. “నేను దర్యాప్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఇదివరకే చెప్పాను. విచారణకు నేను భయపడను. నేను నిన్న ఈ విషయాన్ని చెప్పాను, ఈరోజు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. నేను న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నాను” అని సీఎం మీడియా సమావేశంలో అన్నారు.
కర్ణాటకలో ముడా స్కామ్ అక్కడి రాజకీయాల్లో సంచలనంగా మారింది. సిద్ధరామయ్యతో పాటు ఆయన సతీమణి బీఎం పార్వతిపై అభియోగాలు ఉన్నాయి. మైసూర్ నగర అభివృద్ధి కోసం సేకరించిన భూమికి ప్రతిఫలంగా, అత్యంత విలువైన ప్రాంతంలో పార్వతికి 14 స్థలాల కేటాయింపు వివాదంగా మారింది. ఆమె ఇచ్చి భూమి కన్నా పరిహారంగా పొందిన భూమి విలువు ఎక్కువ అని ఆర్టీఐ యాక్టివిస్టులు గవర్నర్‌కి ఫిర్యాదు చేయడంతో, విచారణకు ఆదేశాలు ఇచ్చారు.
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు