MUDA Land Scam: సిద్ధరామయ్యకు మద్దతుగా మైనారిటీ, బీసీ సంఘం పాదయాత్ర..
- ముడా స్కామ్‌లో ఇరుక్కున్న సీఎం సిద్ధరామయ్య..
- కేసు నమోదు చేసి విచారించాలని కోర్టు ఆదేశం..
- సిద్ధరామయ్యకు మద్దతుగా మైనారిటీ-బీసీ సంఘం పాదయాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MUDA Land Scam: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) ల్యాండ్ స్కామ్ కన్నడ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతికి ఈ స్కామ్‌లో ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. మైసూర్ నగరాభివృద్ధికి పార్వతి నుంచి సేకరించిన భూమి విలువ కన్నా, నగరంలోని ప్రైమ్ ఏరియాల్లో అత్యంత ఖరీదైన 14 ప్లాట్లను కేటాయించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరగాలని బుధవారం కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు సీఎంపై కేసు నమోదు చేసి, విచారణ జరపాలని ఆదేశించింది.
Read Also: PM Modi: రూ.130 కోట్లతో తయారు చేసిన సూపర్ కంప్యూటర్లను ప్రారంభించిన మోడీ..
Also Read
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
- Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
- Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
మైనారిటీలు, వెనకబడిన తరగతులకు సామాజిక న్యాయం జరగాలనే లక్ష్యంలో రాజకీయ సామాజిక ఉద్యమం ‘నేషనల్ అహిందా ఆర్గనైజేషన్’ అక్టోబర్ 03న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మద్దతుగా మార్చ్ నిర్వహించాలని నిర్ణయించాయి. ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మద్దతు ఇవ్వాలని అహిందా ఆర్గనేషన్ భావించింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవద్దని కోరింది.
అహింద నాయకుడు (సిద్దరామయ్య)ని కాపాడేందుకు జాతీయ అహింద సంస్థ హుబ్బళ్లి నుంచి బెంగళూరు వరకు రాజ్యాంగ అవగాహన యాత్రను ప్రారంభిస్తున్నామని, ఈ పాదయాత్రలో వెనకబడిన తరగులు, దళితులు, అహిందా సంఘాల నాయకులంతా పాల్గొంటారని అహింద రాష్ట్ర అధ్యక్షుడు ముత్తన్న శివల్లి అన్నారు. సిద్ధరామయ్య అల్పసంఖ్యాకులు (మైనారిటీలు), హిందువులు (వెనుకబడిన తరగతులు),దళితులు (దళితులు) కోసం నిలబడే అహింద ఉద్యమానికి ప్రధాన వ్యక్తిగా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!