Varun Gandhi: ఇందిరాగాంధీ మనుమడు, మేనకా- సంజయ్ గాంధీల వారసుడు వరుణ్ గాంధీ బీజేపీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
స్థానికంగా మెడికల్ షాప్ నడుపుతున్న రాకేష్ మెహానీకి సాయినాథుడు అంటే చాలా భక్తి. ప్రతి గురువారం మండి రోడ్డులోని సాయిబాబా ఆలయానికి వెళ్లేవాడు. అయితే డిసెంబర్ 1న సాయిబాబా ఆలయానికి వెళ్లిన రాకేష్ బాబా పాదాలను తలను వంచి ప్రార్థిస్తూ అలాగే ఉండిపోయాడు.
Jabalpur: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఘోరం జరిగింది. ఓ కూడలి వద్ద అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో ట్రాఫిక్ ఆగింది. ఇంతలోనే అకస్మాత్తుగా ఓ బస్సు వారి పైకి దూసుకొచ్చింది.
weight loss : నితిన్‌గడ్కరీ విసిరిన ఛాలెంజ్‌తో ఓ బీజేపీ ఎంపీ ఏకంగా 32కేజీలు తగ్గారు. దీని వెనుక ఓ కథ ఉంది. అదేంటంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్ ఉజ్జెయినీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ పాల్గొన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు క్రాస్ ఓటింగ్ వేసిన తన మంత్రివర్గంలోని మంత్రులకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కృతజ్ఞతలు తెలిపారు. NDA అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల్లో విజయం సాధించి భారతదేశ తదుపరి రాష్ట్రపతి అవుతారని వెల్లడించారు. ముర్ము గెలుపును సంబరాలు చేసుకుంటూ, శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, “తమ మనస్సాక్షి మాటను విని, ద్రౌపది ముర్మును తదుపరి అధ్యక్షురాలిగా చేయాలని నిర్ణయించుకున్న ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “గిరిజన…
తెలంగాణ సీఎంకు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు లేఖ రాశారు. తన కుటుంబాన్ని , తనకు హత్య చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. కాగా.. అందుకోసమే హైదరాబాద్ ఎమ్మార్ బౌల్డర్ హిల్స్‌లోని తన నివాసం సమీపంలో పదే పదే రెక్కీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అయితే.. జులై 4న తన ఇంటి సమీపంలోని కొందరు రెక్కీ నిర్వహిస్తుండగా.. అందులో ఒకరిని సీఆర్పీఎఫ్ సిబ్బంది పట్టుకున్నారని, అతడిని ప్రశ్నిస్తే ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన బాషా అని చెప్పాడని రఘురామ…
తెలంగాణ రాష్ట్రంలో ఏం సాధించారని ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.. అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్టీవీ తో జరిగిన ఇంటర్వూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. ఇందులో భాగంగా కేవలం రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపి పార్టీకి పరోక్షంగా లబ్ధి చేకూర్చేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రతిపాదన చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది. పీకల్లోతు అప్పుల్లో రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంది. ధరల పెరుగుదలతో…
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర ఉండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడేక్కింది. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై బీజేపీ నిలదీస్తోంది. తాజాగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ మూర్ఖుడు, ఆదివాసీ, గిరిజన వ్యతిరేఖి అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గిరిజనులకు 9.8 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా కులాన్ని,…