Jabalpur: డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. సిగ్నల్ దగ్గర వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jabalpur: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఘోరం జరిగింది. ఓ కూడలి వద్ద అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో ట్రాఫిక్ ఆగింది. ఇంతలోనే అకస్మాత్తుగా ఓ బస్సు వారి పైకి దూసుకొచ్చింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అంతా నిశ్చేష్టులయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. హర్‌దేవ్ పటేల్ అనే వ్యక్తి జబల్‌పూర్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. రోజూలానే శుక్రవారం తన విధులకు హాజరయ్యారు. బస్సు నడుపుతుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో స్టీరింగ్‌పైనే తుదిశ్వాస విడిచారు. ఇదంతా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కెమెరాలో రికార్డైంది.
Read Also: Bharat Jodo Yatra:భారత్ జోడో యాత్రలో కంప్యూటర్ బాబా.. పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ దూరం!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
బస్సు ఇతర వాహనాలను ఢీకొట్టడాన్ని అందులో చూడవచ్చు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా అనేక మంది గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, సిటీ బస్సు గోహల్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతం గుండా వెళుతుండగా, అది అకస్మాత్తుగా దాని మార్గం నుండి తప్పించుకుని, సమీపంలోని వాహనాలను ఢీకొన్నది. ఆటో, కొన్ని బైకులను కొద్ది దూరం లాక్కెళ్లి ఆగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని, సీటులో కూర్చున్న డ్రైవర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. బస్సు రాణిటాల్‌కు వెళ్తోంది. అయితే లోఫ్లోర్ బస్సు కావడంతో దాని కింద ఎవరూ పడలేదని పోలీసులు తెలిపారు.
A bus driver suffers a heart attack in #Jabalpur. Result: major mishap. #MadhyaPradesh pic.twitter.com/rw2liiNnfS
— Ranjan Srivastava (@ranjan_Bpl) December 3, 2022
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!