MP Supriya Sule Garba Dance
దేశమంతా దేవి నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆడపడుచులు సంప్రదాయ నృత్యాలతో సంబరాలు జరుపుకుంటున్నారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని భక్తితో కొలుస్తుంటారు. కొన్ని చోట్ల పూజల తర్వాత సాయంత్రం మహిళలు దాండియా, గార్బా నృత్యాలు చేస్తుంటారు. ఆయా ప్రాంతాల్లో మహిళలు, పురుషులు తేడాలేకుండా అందరూ ఒకచోట చేరి దాండియా, గార్బా ప్రదర్శన చేసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె, బారామతి ఎంపీ సుప్రియా సూలే గార్బా, దాండియా ఆటలతో అలరించారు. మహారాష్ట్రలోని ఇందాపూర్ పరిధిలోని లఖెవాడి ప్రాంతంలో ఆమె స్థానికులతో కలిసి గార్బా నృత్యం చేశారు. చేతుల్లో చెక్క కోలలు పట్టుకుని దాండియా ఆడారు. లోవెయాత్రి సినిమాలోని పాటకు అభిమానులతో కలిసి ఆడిపాడారు.
అలాగే ముంబై లోకల్ ట్రైన్ లో కొందరు మహిళలు ట్రైన్ లోనే ఒక సమూహంగా ఏర్పడి గర్బా డ్యాన్స్ చేశారు. ఈ మధ్య కొందరు వినూత్నంగా రాజస్తాన్ లోని స్విమ్మింగ్ పూల్ లో గుంపులుగా గర్బా డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ పట్టణంలోని పాతబస్తీలో పురుషులు నవరాత్రి వేడుకలు రాగానే చీరలు కట్టుకుని మరీ గర్బా డ్యాన్స్ చేస్తారు. అయితే.. అక్కడ నవరాత్రి వేడుకలలో ఎనిమిదవ రోజున బరోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు చీరలు ధరించి గర్భా డ్యాన్స్ చేస్తారు. ఇక్కడ 200 ఏళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.