Saibaba Temple: సాయి పాదాలమీదే ప్రాణాలు వదిలాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saibaba Temple: చావు ఎప్పుడు ఏ క్షణాల మనిషికి ప్రాణాలు తీసుకుంటుందో తెలియని అయోమయం. మాట్లాడుతున్న, డ్యాన్స్ చేస్తున్న ఏ క్షణాన మృత్యువు తన ఓడికి చేర్చుకుంటుందో తెలియదు. ఇలాంటి ఘటనలు మనం తరుచూ చూస్తున్నాము. సాయిబాబా ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రార్థనలు చేస్తూ మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. ఆ వ్యక్తి గుడిలో సాయిబాబా ముందు తల వంచి తిరిగి లేవలేదు. ఆ వ్యక్తిని రాకేష్‌గా గుర్తించారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.
స్థానికంగా మెడికల్ షాప్ నడుపుతున్న రాకేష్ మెహానీకి సాయినాథుడు అంటే చాలా భక్తి. ప్రతి గురువారం మండి రోడ్డులోని సాయిబాబా ఆలయానికి వెళ్లేవాడు. అయితే డిసెంబర్ 1న సాయిబాబా ఆలయానికి వెళ్లిన రాకేష్ బాబా పాదాలను తలను వంచి ప్రార్థిస్తూ అలాగే ఉండిపోయాడు. నమస్కరిస్తున్నాడని అక్కడి భక్తులు భావించారు. అటుగా వెళ్లిన వారు నమస్కరిస్తున్న రాకేష్ నుంచి ఏ చలనం లేదు. పావుగంట పాటు కదలకుండా ఉండిపోయిన రాకేష్ స్పృహ తప్పి పడి ఉండడం చూసిన వారికి అనుమానం వచ్చింది. అయితే అక్కడే వున్న పూజారి రాకేష్ ను తడిమి చూడగా రాకేష్ స్పృహలో లేదు. విషయం తెలుసుకున్న ఆలయ పూజారి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాకేష్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. రాకేష్ గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. అక్కడున్న సీసీటీవీలో రాకేష్ కుప్పకూలిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన సాయిబాబా పాదాల చెంత మరణించడం వల్ల మోక్షం లేదా స్వర్గం లభిస్తుందని సోషల్ మీడియాలో పలువురు పేర్కొంటున్నారు.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని పిలువబడే సైలెంట్ హార్ట్ ఎటాక్ విపరీతమైన ఛాతీ నొప్పి, ఒత్తిడి, అకస్మాత్తుగా శ్వాస ఆడకపోవడం, తల తిరగడం వంటి లక్షణాలను కలిగి ఉంటుందని ఆరోగ్య నిపుణుల అంటున్నారు. బయటకి ఆరోగ్యంగా కనిపించినా క్షణాల్లో గుండెపోటుతో చనిపోతారని అన్నారు. రాకేష్ కి కూడా ఇలా చనిపోవడానికి కారణం ఇదే అని చెబుతున్నారు.
मध्यप्रदेश कटनी साईं मंदिर में बाबा के चरणों में टेका मत्था, फिर सिर नहीं उठा पाया युवक, हार्ट अटैक से मौत!#katni pic.twitter.com/zn3Wx1ts7Z
— manishkharya (@manishkharya1) December 4, 2022
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..