Bandi Sanjay: రజాకార్ సినిమాకు వినోదపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని, పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఈ సినిమా చూపించాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి ఎంపీ బండి సంజయ్ కుమార్ లేక రాశారు.
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. సీట్ల లెక్క తేలింది. జనసేన-బీజేపీకి కలిపి 8 ఎంపీ సీట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఇందులో బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేయబోతుందనేది సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. కాకినాడ నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయబోతున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత ఈ అంశంపై క్లారిటీ రానుంది. మచిలీపట్నం లోక్సభ స్థానం…
ప్రజాప్రతినిధుల లంచాల కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. పార్లమెంటు, శాసనసభల్లో ఎవరైనా సభ్యులు అవినీతికి పాల్పడితే వారిని విచారించే విషయంలో ఎలాంటి మినహాయింపు లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
Raja Singh: పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా అని తన మనసులోని మాటను బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ బయట పెట్టారు. ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారో సీఎం స్పష్టం చేయాలన్నారు.
'క్యాష్ ఫర్ క్వైరీ' కేసులో తనను పార్లమెంట్ సభ్యత్వం నుంచి బహిష్కరించడాన్ని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి బహుమతులు, అక్రమంగా లంచం తీసుకున్నట్లు ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను సభ ఆమోదించడంతో డిసెంబర్ 8న మొయిత్రాను లోక్ సభ నుంచి బహిష్కరించారు. ఈ ఆరోపణలను టీఎంసీ నేత తీవ్రంగా ఖండించారు.
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా.. తన ఎంపీ పదవికి రాజీనామా సమర్పించేందుకు పార్లమెంట్ కు వెళ్లారు. అక్కడ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాజీనామాను సమర్పించారు. కాగా.. సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ స్పీకర్ దగ్గరకు తీసుకుని వెళ్లారు.
దేశంలో చట్ట సభల్లో సభ్యులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులను తొందరగా పరిష్కరించే బాధ్యతను హైకోర్టులకు అప్పగిస్తూ ధర్మాసనం ఉత్వర్వులు ఇచ్చింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి మళ్లీ మారుతారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెబుతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా దిగిపోయి.. ఆయన స్థానంలో అజిత్ పవార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని సంచనల వ్యాఖ్యలు చేశారు.