Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వానికి కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి శిరోభారంగా తయారైంది. ఆధిపత్యం కోసం జరుగుతున్న పోటాపోటీ చర్యలు వ్యక్తిగత ప్రతిష్ఠను, పార్టీ ఇమేజ్ ను బజారులో పెడుతున్నాయి. ఈ దిశగా కొన్ని జిల్లాల్లో వ్యవహారాలు హద్దులు దాటిపోగా…..ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ వాతావరణం నివురుగప్పి కనిపిస్తోంది. కూటమిలో ఒకరంటే…ఒకరికి పడకపోవడం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మొదలైపోతే….ఇటీవల ఎంపీలు, ఎమ్మెల్యేలకు అస్సలు పొసగడం లేదు. ఒక విధంగా గ్రూప్ రాజకీయాలు కట్టి…
మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఖాండ్వాలో తీవ్ర విషాదం నెలకొంది. దుర్గామాత నిమజ్జనోత్సవంలో అపశృతి జరిగింది. దుర్గమ్మ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ట్రాక్టర్ చెరువులో పడి పోయింది. దీంతో 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ఆపరేషన్ సిందూర్ దెబ్బేంటో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు రుచి చూశాయని.. ఈ మేరకు జైషే ఉగ్ర సంస్థ అంగీకరించిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ బుధవారం 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇక మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు.
Sambhal Violence : సంభాల్ హింసపై సిట్ దర్యాప్తు పూర్తి చేసింది. ఆ బృందం వెయ్యి పేజీలకు పైగా చార్జిషీట్ దాఖలు చేసింది. ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్, సదర్ ఎమ్మెల్యే కుమారుడు సుహైల్ ఇక్బాల్ సహా 37 మంది నిందితులు నిందితుల్లో ఉన్నారు
మన దేశంలోని చాలా కుటుంబాల్లో ఆడబిడ్డల కంటే మగ పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. సామాజిక, ఆర్థిక కారణాలవల్ల కొడుకును ఆస్తిగా, కుమార్తెను బాధ్యతగా భావించడం అనాదిగా వస్తోంది. దాంతో పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి ఎంతోమంది గుట్టుచప్పుడు కాకుండా గర్భస్రావం చేయించుకుంటున్నారు. కడుపులోని ఆడబిడ్డను కడతేరుస్తున్న ఘటనలు మన దేశంలో అనేకం జరుగుతూనే ఉన్నాయి.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం భారతదేశ ప్రజలకు తీర్చలేనటువంటి లోటన్నారు. 1991లో పీవీ నరసింహారావు ప్రధాని మంత్రిగా ఉన్నప్పుడు మొట్ట మొదటిసారిగా మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక శాఖ మంత్రి నియమించారని గుర్తు చేశారు. 15 టన్నుల బంగారాన్ని కుదవపెట్టి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చారన్నారు. భారతదేశ ఆర్థిక పరిస్థితి కుదేలైన సమయంలో ప్రధానిగా పీవీ నరసింహారావు, ఆర్థిక శాఖ…
కేటీఆర్.. జన్వాడ ఫాం హౌస్ నాది కాదంటారు..? మిత్రున్ని కోర్టుకు పంపించారు.. అక్రమ నిర్మాణం కూల్చాలి అంటారు.. ఇంకో పక్క కోర్టులో స్టేకి వెళ్ళారని ఎంపీ చామల కిరణ్ అన్నారు. కేటీఆర్ పక్కన ఉండే చిల్లర మనుషులు మార్ఫింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరికి ఉన్నా.. హైడ్రా తన పని తాను చేస్తుందన్నారు.
మధ్యప్రదేశ్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ అత్యుత్సాహం ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఓ కోచింగ్ సెంటర్‌ను ప్రమోట్ చేస్తూ ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన ప్రకటన పబ్లిక్‌లోకి రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆమె చర్యను తప్పుపడుతూ సస్పెండ్ చేవారు.
రోజురోజుకి సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓ వైపు క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలకు కళ్లెం వేస్తున్నా.. ఇంకోవైపు సైబర్ నేరగాళ్లు కూడా సరికొత్త వ్యూహాలతో ఖాకీలకే సవాళ్లు విసురుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఒక ఐఏఎస్ పేరుతో బంధువుల్ని బురిడీ కొట్టించి నగదు కాజేశారు. ఈ ఘటన జబల్పూర్లో జరిగింది.