సీఎం సొంత ఇలాఖా లో కాంగ్రెస్ కు ఓటర్లు షాక్ ఇచ్చారు. మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఘన విజయం సాధించారు. 4,500 ఓట్ల మెజార్టీతో డీకే అరుణ విజయ దుందుభి మోగించారు. సర్వ శక్తులు ఒడ్డీనా వంశీ చంద్ రెడ్డి గెలుపు తీరాలకు చేరలేదు.
మధ్యప్రదేశ్ వైద్యులకు ఒక షాకింగ్ సంఘటన ఎదురైంది. ఎన్నడూ చూడలేని అరుదైన దృశ్యం ప్రత్యక్షం కావడంతో వైద్యులే నివ్వెరపోయారు. అసలేం జరిగింది. డాక్టర్లే షాకైన ఆ సంఘటన ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులను మ్యాజిక్ వాయిస్ యాప్ ద్వారా ట్రాప్ చేసి అత్యాచారం చేసేవారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రిజేష్ ప్రజాపతి, అతని సహచరులు రాహుల్ ప్రజాపతి, సందీప్ ప్రజాపతి, లవకుష్ ప్రజాపతి సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సీఎం పీఏ విభవ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విభవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు.
సీఎం నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసు రోజురోజుకూ ఊపందుకుంది. ఈ కేసులో పోలీసులు మలివాల్‌ను నాలుగు గంటల పాటు విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. అనంతరం ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
ప్రస్తుతం దేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమయాని కంటే ముందే అండమాన్ - నికోబార్‌ను తాకబోతున్నాయి.
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తైంది. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అభ్యర్థులు, వారి తరఫున హాజరైన ప్రతినిధుల ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ కుమార్తె ఆసీఫా భుట్టో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. నేషనల్ అసెంబ్లీ సభ్యురాలిగా ఆమె ప్రమాణం చేశారు. మార్చి 29న షహీద్ బెనజీరాబాద్ నుంచి ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
దేశంలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం దేశం మొత్తం 7 దశల్లో ఈ ఎన్నికలు జరగనుండగా.. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్, జూన్ 1న చివరి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక ఆ తర్వాత జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాల తోపాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలలో అన్ని…
పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ జర్దారీ కుమార్తె అసీఫాఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆసీఫా సింధ్ ప్రావిన్స్‌లోని షహీద్ బెనజీరాబాద్ ప్రాంతం నుంచి ఎన్నికయ్యారు.