టీడీపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. బడ్జెట్‌లో ఏపీ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించారని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టారని.. ఎన్నో పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపెట్టారన్నారు.
శ్రీకాకుళం ఎంపీ సీట్లో ఈసారి రామ్మోహన్ నాయుడికి మామూలుగా ఉండదా? గత రెండు విడతల్లో ఎదురవని, అసలు ఊహించని సమస్యలు ఎదురవబోతున్నాయా? సొంత పార్టీ నేతలే ఆయన్ని ఓడిస్తామని శపధం చేయడానికి కారణాలేంటి? మారుతున్న సిక్కోలు రాజకీయం ఏంటి? తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది శ్రీకాకుళం జిల్లా. కానీ… గత ఎన్నికలలో వైసీపీ హవా నడిచింది. అందుకే ఈసారి పట్టు నిలుపుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది పార్టీ నాయకత్వం. ఆ విషయంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు ముందున్నారన్నది…
దమ్ముంటే రాజకీయాల్లోకి వచ్చాక నేను ఎక్కడైనా ఒక్క రూపాయి తిన్నానని రామ్మోహన్ నాయుడు నిరూపించినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ సవాల్ విసిరారు.
పీలో కరువు విలయతాండవం చేస్తోందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, సీఎం జగన్ కనీసం స్పందించడం లేదన్నారు.
తెలుగు ప్రజలకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ మా అందరికి బాధాకరమైన విషయం.. తితిలీ తుఫాన్ సమయంలో మా జిల్లా ప్రజలతో కలిసి బాబు దసరా జరుపుకున్నారు.. ప్రజా నాయకుని అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు అని ఆయన ఆరోపించారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.. ఇక, ఈ ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీపీ సమావేశం జరిగింది.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ రామ్మోహన్ నాయుడు.. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏపీకి నష్టం అన్నారు.. ఈ ఫలితాలు చూసి సీఎం జగన్ మరింత భయపడతారని జోస్యం చెప్పిన ఆయన.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రాన్ని అడగలేని పరిస్థితిలోకి జగన్ వెళ్తారన్నారు..…
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయం ఇప్పుడు మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.. విభజన సమస్యల పరిష్కారం కోసం జరిగే సమావేశం అజెండాలో మొదట స్పెషల్ స్టేటస్‌ను చేర్చిన కేంద్ర హోంశాఖ.. ఆ తర్వాత మళ్లీ తొలగించడంపై ఏపీ గుర్రుగా ఉంది.. ఈ వ్యవహారంలో బీజేపీతో పాటు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేస్తోంది తెలుగు దేశం పార్టీ.. ఈ వ్యవహారంపై శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ హామీతో వైసీపీ…
దేశంలో బీసీ జనాభా ఎంత వుందో కులగణన చేస్తేనే తెలుస్తుందని బీసీ నేతలు అంటున్నారు. ఏపీలో టీడీపీ ఎంపీ రామ్మోహననాయుడు ఢిల్లీ వేదికగా బీసీ కులగణన కోసం పోరాడుతున్నారు. బీసీ కులగణన సాధించేవరకు నేను మీ వెంటే ఉంటానని, జనగణనలో కులగణన జరగాల్సిన అవసరం ఉందన్నారు రామ్మోహన్ నాయుడు. టీడీపీకి వెన్నెముకగా బీసీలు నిలిచారన్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు బీసీల డిమాండ్ల కు మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం అన్నారు. బీసీల కార్యక్రమం ఎక్కడ…
సీఎం వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దుపై స్పందించిన ఆయన.. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే బెణకని వైఎస్ జగన్ కాలు.. ఢిల్లీ అంటే బెణికిందా..? అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఒక పిరికిపంద అని వ్యాఖ్యానించిన ఆయన.. జగన్ చెప్పిన ప్రత్యేక హోదా ఎక్కడ ఉంది..? కేంద్రాన్ని హోదా అడగకుండా తాడేపల్లిలో తల దాచుకున్నారు అంటూ మండిపడ్డారు. ఏ అంశం పైనైనా టీడీపీ…
రెండున్నరేళ్ల పాలనలో వైఎస్ జగన్ అభివృద్ధిలో జీరో… అవినీతిలో హీరో అంటూ కామెంట్ చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు… శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస స్టేషన్ నుంచి ఎంపీ రామ్మోహన్ నాయుడు , మాజీ ఎమ్మెల్యే కూనరవికుమార్ విడుదలయ్యారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. సీఎం జగన్ ప్యాలెస్ దాటి బయటకు అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు.. తక్షణమే నిత్యావసరాల ధరలను తగ్గించాలని కోరారు.. ఇక, రెండున్నరేళ్ల పాలనలో జగన్ అభివృద్ధిలో జీరో… అవినీతిలో హీరో…