దేశంలో బీసీ జనాభా ఎంత వుందో కులగణన చేస్తేనే తెలుస్తుందని బీసీ నేతలు అంటున్నారు. ఏపీలో టీడీపీ ఎంపీ రామ్మోహననాయుడు ఢిల్లీ వేదికగా బీసీ కులగణన కోసం పోరాడుతున్నారు. బీసీ కులగణన సాధించేవరకు నేను మీ వెంటే ఉంటానని, జనగణనలో కులగణన జరగాల్సిన అవసరం ఉందన్నారు రామ్మోహన్ నాయుడు.
టీడీపీకి వెన్నెముకగా బీసీలు నిలిచారన్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు బీసీల డిమాండ్ల కు మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం అన్నారు. బీసీల కార్యక్రమం ఎక్కడ జరిగినా ఎర్రన్నాయుడు ముందుండేవారు. ప్రతి సదర్భంలోనూ బీసీల సమస్యల పై టీడీపీ ఎంపీలుగా పార్లమెంట్ లో మాట్లాడాం అన్నారు రామ్మోహన్ నాయుడు.
బీసీలకు మంత్రిత్వ శాఖ కేటాయించి,ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓబీసీ సమస్యలను గతంలో పార్లమెంట్ లో ఎర్రన్నాయుడు లేవనెత్తారు. బీసీల కులగణలపై ప్రధానమంత్రి మోడీ నిర్ణయం తీసుకోవాలి. బీసీల డిమాండ్ కోసం మేము పోరాటం చేస్తాం. ఏ కులం ఎంత జాబితా ఉందో బయటకు రాకుండా అడ్డుకున్నారు. స్వాతంత్య్రం తర్వాత బీసీలకు రిజర్వేషన్లు రావడానికి 40 ఏళ్ళు పట్టింది. సమిష్టిగా పోరాడి, మన హక్కులను సాధించుకుందాం అని పిలుపునిచ్చారు రామ్మోహన్ నాయుడు.