Margani Bharat: పవన్ కల్యాణ్‌కు సీఎం పోస్ట్‌పై వైసీపీ ఎంపీఆసక్తికర వ్యాఖ్యలు.. కాపు సోదరులు గమనించాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Margani Bharat: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన కలిసి ముందకు నడుస్తున్నాయి.. అయితే, సీఎం అభ్యర్థి ఎవరు అనేది వచ్చే సీట్లను భట్టి.. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారని ఓవైపు.. మళ్లీ సీఎం అయ్యేది చంద్రబాబే అనే చర్చ మరోవైపు నడుస్తోంది.. అయితే, పవన్ కల్యాణ్.. సీఎం అభ్యర్థిపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అసలు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థేకాదన్న ఆయన.. కాపు సోదరులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.. ఇక, రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ కులగణన పూర్తిస్థాయిలో జరిగిన దాఖలు లేవు.. ప్రతి కులానికి ఎంత మంది జనాభా వున్నారు, అందరికీ ఫలాలు అందుతున్నాయా లేదా అన్న విషయం కులగణన ద్వారా తెలుసుకోవచ్చు.. అందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు సమానంగా అందించవచ్చు.. కులగుణనకు సంబంధించి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం రాజమండ్రిలోనే నిర్వహించారు. బీసీ సంఘాల నేతలు నుంచి అన్ని కులాల కుల సంఘాల దగ్గరనుంచి అభిప్రాయాలు సేకరించాం.. టీడీపీ నేత యనమల ఇతర నేతలు జయహో బీసీ పేరుతో సమావేశం పెట్టడం దారుణం అన్నారు.
ఇక, పార్టీ పుట్టిన 40 ఏళ్ళలో టీడీపీ బీసీలకు ఎన్ని రాజ్యసభ సీట్లు ఇచ్చారు..? అని ప్రశ్నించారు ఎంపీ భరత్.. రాజ్యసభ సీట్లను డబ్బులు తీసుకుని అమ్ముకున్నారు.. బీసీ, ఎస్సీలను టీడీపీ చాలా చిన్న చూపు చూసింది.. వర్ల రామయ్య కు రాజ్యసభ సీటు ఇస్తామని అవహేళన చేశారు.. చంద్రబాబు బీసీ పట్ల దారుణంగా వ్యవహరించారు.. నాయి బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తామన్నారు.. మత్స్యకారుల తోలు తీస్తామన్నారు అని గుర్తుచేశారు. రాజమండ్రి ఎంపీ స్థానం, రాజమండ్రి సిటీ, రూరల్ అసెంబ్లీ స్థానాలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల కేటాయించింది.. మీరు కేటాయించగలరా..? అని సవాల్ చేశారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సీఎం జగన్ బీసీలకు కేటాయిస్తారు.. మీరు ఆ పని చేయగలరా..? అని చాలెంజ్ చేశారు.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
- Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
ఎప్పుడూ కమ్మ సామాజిక వర్గానికే ఇచ్చుకుంటారు.. కేబినెట్‌లో 67 శాతం మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారు.. మీరేనాడైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు ఎంపీ భరత్.. కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు అని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకు ఏనాడైనా అధ్యక్ష స్థానం బీసీలకు ఇచ్చారా? అని ప్రశ్నించారు. తండ్రి కొడుక్కి పట్టం కడతారు.. వారి సామాజిక వర్గమే ఆధిపత్యం కొనసాగిస్తుందని హెచ్చరించారు. ఐదు లక్షల కోట్లు డీబీటి, నాని డీబీటి లో సీఎం జగన్ ప్రజలకు అందించారు.. క్షేత్రస్థాయిలో టీడీపీ – జనసేన బాహాబాహికి తలపడుతున్నారు.. ఈ రెండు పార్టీల భావజాలం ఏ మాత్రం కలవదు.. చంద్రబాబు పల్లకీలు మోయడానికి మాత్రమే పవన్ కల్యాణ్ ఉన్నారు.. పవన్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు.. కాపు సోదరులు ఈ విషయం గమనించాలని సూచించారు ఎంపీ మార్గాని భరత్.
తాజావార్తలు
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!