స్కిల్ డెవలప్మెంట్ స్కీములో అవినీతి జరగలేదని టీడీపీ నాయకులు చెప్పటం లేదు అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. తమ పాత్ర లేదని మాత్రమే చెప్తున్నారు.. స్కాం జరిగిందని మాత్రం ఒప్పుకుంటున్నారు.. ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత సెక్యూరిటీ ఉన్న జైలు రాజమండ్రి సెంట్రల్ జైలు మాత్రమే.. వీవీఐపీ కంటే అత్యంత భద్రత చంద్రబాబుకు కల్పించామని జైలు సూపరింటెండెంట్ ఇప్పటికే నివేదిక ఇచ్చారు అని రాజమండ్రి ఎంపీ చెప్పారు. చంద్రబాబుకు హౌస్ కస్టడి దేనికి.. బయటకు వచ్చేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆయన తెలిపారు.
Read Also: Yatra Online IPO: సెప్టెంబరు 15న యాత్ర ఆన్‌లైన్ ఐపీవో షురూ.!
జీవో ఎంఎస్ నెంబర్-4 ప్రకారం సిమెన్స్ సంస్థ 90శాతం ఉచిత ఎయిడ్ గా నిధులు ఇవ్వాలి అని ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. సెక్షన్ 164 సీఆర్పీసీ కింద పీవీ రమేష్ కన్ఫెషన్ ఇచ్చారు.. చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపించడం సరికాదు అని ఎంపీ అన్నారు. ప్రభుత్వం చంద్రబాబుకు కావలసిన ప్రతి సౌకర్యం కల్పించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో జీఎస్టి ఇచ్చిన నోటీసుల వల్ల బయటపడింది.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం మాత్రమే కాదు.. పోలవరం అమరావతి భూములు స్కాంలు కూడా ఉన్నాయన్నారు.
Read Also: MS Dhoni: నువ్వు మహా చిలిపి బ్రో.. అభిమానిని ఆట పట్టించిన ధోని
పవన్ కళ్యాణ్ కు చీకటి ఒప్పందం చంద్రబాబుతో ఉంది అది ప్యాకేజీ ఒప్పందం అంటూ ఎంపీ భరత్ ఆరోపించారు. బంధు పేరు చెప్పి షాపుల నిర్వాహకులను మూసేయమని బతిమిలాడుకున్నారు.. చంద్రబాబు అరెస్ట్ సహేతుకం కాబట్టే ప్రజలు అంగీకరించారు.. చంద్రబాబును తలదన్నే వ్యక్తి మరొకరు వచ్చారని జగన్ ను చూసి జనం హర్షిస్తున్నారని ఆయన తెలిపారు. 371 కోట్ల గురించే మాట్లాడుతున్నారు.. మరి రూ. 3000 కోట్ల పరిస్థితి ఏంటి.. ఈ స్కామ్ లో మరో పాత్రధారి వికాస్ కన్వాల్కర్ ఎక్కడ.. అచ్చెన్నాయుడు ఫ్రస్టేషన్ చూస్తేనే వాళ్ళు తప్పు చేసారనీ అర్థం అయిపోతుంది అని ఎంపీ భరత్ అన్నారు.