కూటమి ప్రభుత్వ పాలనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో వాగ్దానం చేసిన ‘సూపర్ సిక్స్’ పథకాలు అమలు కావటం లేదని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. విజన్ డాక్యుమెంటరీపై చర్చలు జరపాలని తాను సీఎం చంద్రబాబు నాయుడుకి సవాల్ విసురుతున్నా అని అన్నారు. సినిమాకి పెట్టుబడి పెట్టి టికెట్లు అమ్ముకుంటున్నారని, రైతులు ఎండ వాన చూడకుండా పెట్టుబడి పెట్టి పంట పండిస్తే కనీస మద్దతు ధర…
indias national cinema day: రూ.75కే థియేటర్లో సినిమా చూడొచ్చు.. ఈనెల 16న ‘జాతీయ సినిమా దినోత్సవం’ నిర్వహించాలని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(MAI) నిర్ణయించింది. దీంతో ఆరోజు మల్టీప్లెక్సులతోపాటు దేశవ్యాప్తంగా సుమారు 4 వేల థియేటర్లలో రూ.75కే సినిమాను వీక్షించే అవకాశాన్ని MAI కల్పిస్తోంది. బాలీవుడ్ కపుల్స్ రణ్ బీర్ సింగ్, ఆలియా భట్ కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్రం’ ఈనెల 9న విడుదల కానుండగా.. ఈ సినిమాతోపాటు ఇతర సినిమాలను కూడా 16న రూ.75కే చూడండి.…
జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన నటించిన భీమ్లానాయక్ సినిమాకు ఏపీలో పలు సమస్యలు ఎదురైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టిక్కెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం, అభిమానుల మధ్య వార్ ఇంకా నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావిస్తూ పోస్ట్ చేశారని అభిమానులు భావిస్తున్నారు. ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే.. తొంభై…
ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల వివాదంపై ఎట్టకేలకు పరిష్కారం లభించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం నాడు సినిమా టిక్కెట్ల ధరల సమస్యలపై సచివాలయంలో స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విశ్వజిత్, ఇతర సభ్యులు హాజరయ్యారు. అనంతరం స్టీరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఏపీలోని థియేటర్లలో శుక్రవారం నుంచి 100 శాతం ఆక్యుపెన్సీ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. అయితే ప్రేక్షకులు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. అటు టిక్కెట్ రేట్లపై…
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ రేట్ల విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సంక్రాంతి సీజన్ లో విడుదల కావాల్సిన పాన్ ఇండియా చిత్రాల విడుదల వాయిదా పడటంతో ప్రభుత్వం కూడా ఈ విషయమై నింపాదిగానే నిర్ణయం తీసుకొనేలా కనిపిస్తోంది. పలువురు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు దర్శక నిర్మాతలు ఆర్. నారాయణమూర్తి, రామ్ గోపాల్ వర్మ వంటి వారు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖామంత్రి పేర్ని నానిని వ్యక్తిగతంగా కలిసి తమ వాదన వినిపించారు. అలానే ఏపీ…
కడప జిల్లాలోని శెట్టిపాలెంలో బంధువులతో సంక్రాంతి జరుపుకునేందుకు చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్‌తో నటుడు చిరంజీవి భేటీ కావడం మంచి పరిణామమని ఎమ్మెల్యే రోజా అన్నారు. జగన్ ఏది చేసినా ప్రతిపక్షాలు బురదజల్లడం సరికాదని రోజా అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రజల కోసం స్కూళ్లు, కాలేజీల ఫీజులను ప్రభుత్వం తగ్గిస్తే యాజమాన్యాలపై కక్ష సాధింపు చర్య అని ఆరోపించారని… కరోనా సమయంలో ప్రజలను…
టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ ఈ-పేపర్‌ను మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన సినిమా టిక్కెట్ల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు అనవసరంగా సినిమా టిక్కెట్ల వివాదంలోకి టీడీపీని లాగుతున్నారని… టీడీపీకి సినిమా పరిశ్రమ సహకరించిన దాఖలాలు లేవన్నారు. సీఎంగా ఉన్నప్పుడు, ఇటీవల తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని చంద్రబాబు గుర్తుచేశారు. రాజకీయ పార్టీ పెట్టకముందు… ఆ తర్వాత చిరంజీవి తనతో బాగానే ఉన్నారని… కానీ 2009లో చిరంజీవి తనకు సహకరించి ఉంటే అప్పుడు…
సినిమా వాళ్లపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. సినిమా వాళ్లను బలిసింది అనడం బాధాకరమని… నిజనిజాలు తెలియకుండా ఓ ప్రజాప్రతినిధి ఈ విధంగా మాట్లాడటం తెలుగు సినిమా పరిశ్రమ మొత్తాన్ని అవమానించినట్లేనని ఆవేదన వ్యక్తం చేసింది. మన తెలుగు సినిమా సక్సెస్ రేటు 2 నుంచి 5 శాతం మాత్రమేనని.. మిగతా సినిమాలు…
టాలీవుడ్లో నెలకొన్ని సినిమా టిక్కెట్ ధరలపై మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోమవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 1955 సినిమాటోగ్రఫీ చట్ట ప్రకారమే సినిమా టిక్కెట్ ధరలు ఉన్నాయని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. 1955 నుంచి అదే జరుగుతోందని… తాము కొత్తగా సృష్టించిందేమీ లేదన్నారు. రామ్‌గోపాల్ వర్మ తాను చెప్పాల్సింది చెప్పారని.. అన్నీ వివరంగా విన్నానని తెలిపారు.…
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు వీరి సమావేశం జరిగింది. అనంతరం ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ… మంత్రి పేర్ని నానితో చర్చలు సంతృప్తికరంగా ముగిశాయన్నారు. సినిమా టిక్కెట్ రేట్లపై తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్పానని… ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్లు రామ్‌గోపాల్ వర్మ తెలిపారు. Read Also: ప్రభాస్… హాలీవుడ్ హీరో అనిపించుకుంటాడా? సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గిస్తే సినిమా క్వాలిటీ…