ఏపీలో ప్రస్తుతం సినిమా టిక్కెట్ల రేట్ల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఎంతోమంది కార్మికులు ఆధారపడ్డ సినిమా థియేటర్ల కంటే వాటి పక్కన ఉండే కిరాణాషాప్ వాళ్లు ఎక్కువ సంపాదిస్తున్నారంటూ హీరో నాని చేసిన కామెంట్లు అధికార పార్టీలో వేడిని పుట్టించాయి. మార్కెట్‌లో ప్రతిదానికి ఎమ్మార్పీ ఉన్నట్లే సినిమా టిక్కెట్లకు కూడా ఎమ్మార్పీ అవసరమని.. ఇష్టం వచ్చినట్లు టిక్కెట్ రేట్లను పెంచుకుంటామంటే ఎలా అని హీరో నానికి మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. అయితే హీరో…
ఏపీలో సినిమా టిక్కెట్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. రేపు ‘పుష్ప’ సినిమా విడుదల నేపథ్యంలో టిక్కెట్ల రేట్ల విషయంలో గందరగోళం నెలకొంది. గతంలో ఉన్న కమిటీలో లోటు పాట్లను సరిచేసి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు చేసిన విషయం తెలిసిందే. టిక్కెట్ల ధరల జాబితాను జాయింట్ కలెక్టర్‌కు పంపించాలని థియేటర్ యజమానులకు కూడా హైకోర్టు సూచించింది. టిక్కెట్ల ధరలకు అనుగుణంగా పన్నులు చెల్లించాలని కూడా హితవు పలికింది.…
గత కొన్ని రోజులు ఏపీలో సినిమా టికెట్ల ధరల చుట్టూ చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ ప్రభుత్వం టికెట్ల ధరను తగ్గించడం మాత్రమే కాకుండా బెనిఫిట్ షో లను రద్దు చేస్తూ కేవలం రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలని స్పష్టం చేసింది. అలాగే టికెట్లు కూడా ఆన్లైన్ లో విక్రయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా టికెట్ల ధరలు పెంచేందుకు థియేటర్లకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ ఇది ఏపీలో కాదు.. తెలంగాణలో. తాజాగా…