ఏపీలో ఇవాల్టి నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి రానుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. అలాగే 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడుస్తాయి. మాల్స్, దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు తప్పని సరిగా పాటించాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలన్న సీఎం జగన్.. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలన్నారు.మాస్క్‌లు ధరించకపోతే జరిమానాను…
సినిమా ఇండస్ట్రీపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తమ వాళ్లు పరిశ్రమలో ఉన్నారు కాబట్టే సినిమా వాళ్లకు చంద్రబాబు సపోర్ట్ ఇస్తున్నారని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఆరోపించారు. సినిమా టిక్కెట్ రేట్లు తగ్గిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. పేదల కోసమే తమ ప్రభుత్వం టిక్కెట్ల రేట్లను తగ్గించిందన్నారు. సినీ హీరోలు కోట్లు ఆర్జిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని.. పేదలు వినోదం కోసం సినిమాకు వెళ్తే రూ.వెయ్యి,…
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం జీవో నెం 35ను ప్రవేశపెట్టి సినిమా టికెట్ల ధరలు నిర్ణయించి ఆ ధరలకంటే ఎక్కువకు అమ్మకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయడంతో మరోసారి హైకోర్టు ఏపీ సినిమా టికెట్లపై…
ఏపీలో సినిమా టికెట్ల ధరల అంశం ఇంకా సర్థుమనగడం లేదు. అయితే తాజాగా ఏపీ టికెట్ల ధరలపై సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కన్జ్యూమర్ రైట్స్ ప్రొటక్షన్‌కు కూడా ఫోరం ఉందని ఆయన అన్నారు. ప్రోమోలు రిలీజ్ చేసి బ్రహ్మాండంగా ఉందని చెబుతున్నారు. సినిమాటోగ్రఫీ చట్టం ఒకటి ఉందని, రేట్లు, సమయాలు కంట్రోల్ చేయాలని ఉందనే విషయం తెలుసా అని ఆయన ప్రశ్నించారు. జగనో, నేనో వచ్చాక పెట్టిన నిబంధనలు కావని, సినిమా రేట్లు ఫిక్స్…
ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, ఏపీ ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ కోరాడు. థియేటర్ల సమస్యలపై ప్రభుత్వం నెలరోజులు సమయం ఇవ్వడం సంతోషంగానే ఉన్నా… థియేటర్ల సీజ్ అంశంపై పని ఒత్తిడిలో ఉండే జాయింట్ కలెక్టర్‌లను కలిస్తే ఉపయోగం ఏం ఉంటుందని ప్రశ్నించారు. కరోనాతో రెండేళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. ఓటీటీ కారణంగా ఎన్నో నష్టాలకు గురయ్యామని ఎన్వీ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.…
ఏపీలో థియేటర్లు మూసివేస్తుండటంపై ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. నేచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ సక్సెస్‌మీట్‌కు ముఖ్య అతిథిగా ఆర్.నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏపీలో టిక్కెట్ రేట్ల వల్ల మూతపడ్డ అన్ని సినిమా థియేటర్లు తెరుచుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లు మూసివేయడం బాధాకరమన్నారు. సినిమా థియేటర్లు మూసివేయవద్దని యజమానులు, నిర్మాతలను ఆయన కోరారు. Read…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చల దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు టాలీవుడ్ పెద్దలు.. మంత్రి పేర్నినానిని కలిసి చర్చలు జరపాలని భావిస్తున్నారు. రేపు సినీ ప్రముఖుల బృందం.. మంత్రి పేర్నినానితో సమావేశం అయ్యే అవకాశం ఉంది.. కాగా, గత కొన్ని రోజులుగా ఏపీలో సినిమా థియేటర్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కొన్ని థియేటర్లను ఇప్పటికే మూసివేశారు. టికెట్ రేట్లు తక్కువగా ఉంటే.. సినిమా థియేటర్లను నడపలేమంటూ.. మరికొందరు స్వచ్ఛందంగా సినిమా థియేటర్లను మూసివేస్తున్నారు. దాంతో..…
ఇటీవల తెలంగాణలో సినిమా టికెట్ రేట్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సిందే. అయితే దీనిపై టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 21న తెలంగాణ సర్కారు సినిమా టికెట్ రేట్లు పెంచుతూ జీవో నెం.120 తీసుకువచ్చిందని, అయితే ఇది చిన్న నిర్మాతలను పూర్తిగా నిరాశపరిచిందని వెల్లడించారు. పెద్ద సినిమాకు, చిన్న సినిమాకు ఒకే విధంగా టికెట్ రేట్లు ఉంటే చిన్న సినిమా బతికి బట్టకట్టేదెలా అని నట్టి కుమార్…
ఏపీలో సినిమా టిక్కెట్ల ధర విషయంపై అగ్గి రాజుకుంది. హీరో నాని చేసిన కామెంట్లపై ఒకవైపు ప్రభుత్వం విమర్శిస్తుంటే.. మరోవైపు పలువురు ప్రతిపక్షాల నేతలు నానికి మద్దతు పలుకుతున్నారు. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్‌ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. ‘ఏంటో మరి’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. Read Also: హీరో నానికి మంత్రి అనిల్ కౌంటర్.. పవన్ మోజులో పడి చాలా తగలేశా..! ‘నాణ్యత ప్రమాణాలు కాపాడటానికి, ప్రజలకు…
ఏపీలో సినిమా టిక్కెట్ల అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సినిమా టికెట్ల రేట్లు తక్కువగా ఉంటే ప్రజలకు మంచిదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కౌంటర్ ఇచ్చారు. ‘సినిమా అందరికి అందుబాటులో ఉండాలి. అందుకే ధరలు తగ్గించాం- మంత్రి బొత్స. మరి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండక్కర్లేదా వైఎస్ జగన్ గారూ. అవి కూడా తగ్గించండి- ప్రజలు’ అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. Read…