indias national cinema day: రూ.75కే థియేటర్లో సినిమా చూడొచ్చు.. ఈనెల 16న ‘జాతీయ సినిమా దినోత్సవం’ నిర్వహించాలని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(MAI) నిర్ణయించింది. దీంతో ఆరోజు మల్టీప్లెక్సులతోపాటు దేశవ్యాప్తంగా సుమారు 4 వేల థియేటర్లలో రూ.75కే సినిమాను వీక్షించే అవకాశాన్ని MAI కల్పిస్తోంది. బాలీవుడ్ కపుల్స్ రణ్ బీర్ సింగ్, ఆలియా భట్ కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్రం’ ఈనెల 9న విడుదల కానుండగా.. ఈ సినిమాతోపాటు ఇతర సినిమాలను కూడా 16న రూ.75కే చూడండి.
అయితే.. తమ వ్యాపారాన్ని నిలబెట్టిన సినీ ప్రియుల కోసం 75 రూపాయలకే తక్కువ ధరకే సినిమా చూపించాలనే ఉద్దేశంతో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో జనాలు చాలా వరకు థియేటర్స్ వైపు రావట్లేదనే విమర్శ ఉంది. ఇక జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా ఇంకా థియేటర్లకు తిరిగి రాని సినీ ప్రేమికులకు ఇది ఆహ్వానం లాంటిది. ఈనేపథ్యంలో.. సెప్టెంబర్ 16న ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. ఇక మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలనే కోరిక చాలామందికి ఉంటుంది, కానీ.. టికెట్ ధరలు చాలా ఎక్కువ అని అటువైపు కూడా చూసి ఉండరు. దీంతో.. సెప్టెంబర్ 16న 75 రూపాయలకే సినిమా టికెట్ అంటూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఆఫర్‌ను వినియోగించుకోండి. పీవీఆర్, ఐనోక్స్, ఏషియన్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. సో సినిమా ప్రియులు ఇంకా లేట్ ఎందుకు మీరు సినిమా చూసేందుకు వచ్చేయండి.
NASA Artemis 1 Launch: నేడే ఆర్టెమిస్-1 ప్రయోగం.. ఈ రోజైనా దూసుకెళ్తుందా?