ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ నుంచి శుక్రవారం నాడు సమంత ఐటం సాంగ్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ పాట యూట్యూబ్ రికార్డులను షేక్ చేస్తోంది. “ఊ.. అంటావా? ఊ..ఊ.. అంటావా?” అంటూ సాగే ఈ పాట 24 గంటల్లో నాలుగు భాషల్లో కలిపి 14 మిలియన్ల వ్యూస్‌తో సౌత్ ఇండియాలో మోస్ట్ వ్యూడ్ సాంగ్‌గా నిలిచింది. ఇక ఐటం సాంగ్‌కు సమంత వల్ల క్రేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. అటు దేవిశ్రీప్రసాద్ క్యాచీ…
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రల్లో నటించిన ‘బాహుబలి’ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 2017లో విడుదలైన బాహుబలి-2 ట్రైలర్ ఇప్పటికీ దక్షిణాది సినిమాల్లో టాప్‌లో కొనసాగుతుండటం విశేషం. తాజాగా విడుదలైన రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ ట్రైలర్ కూడా బాహుబలి-2 రికార్డును టచ్ చేయలేకపోయింది. Read Also: రివ్యూ: లక్ష్య బాహుబలి-ది కంక్లూజన్ ట్రైలర్ 24 గంటల్లో 21.81 మిలియన్ వ్యూస్ దక్కించుకుని దక్షిణాది చిత్రాల్లోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది.…
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో మూవీ ప్రమోషన్‌లు జోరుగా నడుస్తున్నాయి. ఈ రోజు విడుదలైన ట్రైలర్ గురించి రివ్యూలు, సినిమా కథ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రామ్‌చరణ్-ఎన్టీఆర్ నటన.. ఇలా పలు అంశాల గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందనే విషయంపైనా పలువురు ఆసక్తిగా…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈనెల 9న ఉదయం 10 గంటలకు ఈ మూవీ ట్రైలర్ తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన థియేటర్లలో విడుదల కాబోతోంది. థియేటర్లలో విడుదలైన అనంతరం యూట్యూబ్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ట్రైలర్ చూస్తే రామ్‌చరణ్, ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు రావడం ఖాయమని ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఈ ట్రైలర్ నిడివి రెండున్నర నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. హైదరాబాద్…
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఈ సినిమాను నైజాంతో పాటు ఏపీలోని వైజాగ్ ఏరియాకు నిర్మాత దిల్ రాజు తన వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా పంపిణీ చేశాడు. డిస్ట్రిబ్యూటర్‌గా ఈ సినిమా ద్వారా లాభాలను చవిచూడటంతో దిల్ రాజు అఖండ టీమ్‌కు పార్టీ ఇచ్చాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ పార్టీకి బాలయ్య, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ సహా పలువురు దిల్ రాజు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. టాలీవుడ్‌లో భయం లేని హీరో అంటే అల్లు అర్జున్ అంటూ ఆర్జీవీ పేర్కొన్నాడు. రీసెంట్‌గా విడుదలైన ‘పుష్ప’ ట్రైలర్‌ను చూసి ఆయన తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పుష్ప లాంటి పాత్రలు బన్నీ కాకుండా మరెవరూ చేయలేరన్నాడు. రియలిస్టిక్ పాత్రలు చేయాలంటే అల్లు అర్జున్ మాత్రమే పర్‌ఫెక్ట్ అని ఆర్జీవీ కొనియాడాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రజనీకాంత్, మహేష్…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేష్. ఆతర్వాత ఈ అమ్మడు వరుస సినిమాలతో తెలుగులో బిజీ అయ్యింది కీర్తి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. తాజాగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి. ఈ చిత్ర విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్ర విడుదలను…
కన్నడ సీని పరిశ్రమ మరోసారి విషాదంలో మునిగింది. ఈ మధ్య కాలంలో మరణించిన పునీత్ రాజ్‌కుమార్ మృతి నుంచి కన్నడ ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కాగా తాజాగా మరోనటుడు మరణించిన వార్తను కన్నడ సీని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖ కన్నడ నటుడు శివరాం శనివారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 83 ఏళ్ల శివరాం మంగళవారం రాత్రి తన నివాసంలో పూజా కార్యక్రమాలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకులారు. శివరాంను కుటుంబ…
టాలీవుడ్‌లో హీరో నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. ఈ విజయాల్లో ముఖ్యంగా ఇద్దరు డైరెక్టర్లకు సింహ భాగం ఉంది. గతంలో బాలయ్య-బి.గోపాల్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ షేక్ అయ్యేది. వీరిద్దరి కాంబోలో చాలా హిట్లు ఉన్నాయి. లారీడ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే భారీ అంచనాలతో వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా విఫలం కావడంతో ఆ…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హైదరాబాద్‌లోని కేపీహెచ్బీలో సందడి చేశారు. ఆయన నటించిన అంతిమ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కేపీహెచ్‌బీలోని సుజనా ఫోరమ్ మాల్‌కు సల్మాన్ విచ్చేశారు. అయితే సల్మాన్ ను చూసేందుకు భారీగా అభిమానులు తరలిరావడంతో ఒక్కసారిగా మాల్ ప్రాంగంణం కిక్కిరిసిపోయింది. అయితే సల్మాన్ ఖాన్ అంతిమ్ సినిమాలో మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఆయుష్ శర్మ నటించారు. ఈ మూవీ గత నెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.…