‘నయీం డైరీస్’ మూవీకి హైకోర్టు షాక్.. సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ గ్యాంగ్‌స్టర్‌గా చెలామణి అయిన నయీం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘నయీం డైరీస్’ చిత్రానికి హైకోర్టులో చుక్కెదురైంది. నయీం డైరీస్ మూవీలో అసభ్యకర దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారురాలు బెల్లి లలిత కుటుంబసభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అభ్యంతకర సన్నివేశాలు తొలగించేవరకు సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Read Also: ఫ్యామిలీతో రజినీకాంత్ బర్త్ డే సెలెబ్రేషన్స్… పిక్స్ వైరల్
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
అయితే సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించేందుకు తమకు రెండు రోజుల సమయం కావాలని నయీం డైరీస్ సినిమా దర్శకుడు తరఫు న్యాయవాది కోర్టును కోరారు. సాధ్యమైనంత త్వరగా ఆ దృశ్యాలను తొలగించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా నయీం డైరీస్ మూవీ గత శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఈ మూవీ విడుదలైన సంధ్య థియేటర్ వద్ద బెల్లి లలిత కుటుంబసభ్యులు, తెలంగాణ వాదులు ఆందోళనకు దిగడంతో ప్రదర్శన నిలిచిపోయింది. అనంతరం ఈ సినిమాపై ఆందోళనకారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా నయీం డైరీస్ మూవీలో వశిష్ట సింహ, నిఖిల్ దేవాదుల, యగ్న శెట్టి, సంయుక్త, శశికుమార్ ముఖ్య పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!