గుడ్ లక్ సఖి రీలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేష్. ఆతర్వాత ఈ అమ్మడు వరుస సినిమాలతో తెలుగులో బిజీ అయ్యింది కీర్తి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. తాజాగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి. ఈ చిత్ర విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్ర విడుదలను ఎందుకో పలు కారణాల వల్ల దర్శక నిర్మాతలు వాయిదా వేశారు. ఇది వరకు నవంబర్ 26న విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఈ చిత్రాన్ని డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. కానీ డిసెంబర్‌లో భారీ చిత్రాల రీలీజ్‌లు ఉండటంతో మేకర్స్ వెనుకడు వేస్తున్నారని సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుందని మేకర్స్ ప్రకటించారు.
ఈ ఏడాది విడుదలయ్యే ఆఖరి టాలీవుడ్ సినిమా ఇదే కానుంది. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న గుడ్ లక్ సఖి చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి నిర్మిస్తున్నారు. చిరంతాన్ దాస్ సినిమాటోగ్రాఫర్. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్లు అన్నీ కూడా విశేషమైన ఆదరణను సొంతం చేసుకున్నాయి. కాగా గ్రామీణా నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!