ఏపీలో టిక్కెట్ల రేట్ల వ్యవహారం, బెనిఫిట్ షోలను రద్దు చేయడం వంటి అంశాలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. పెద్ద హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు ప్రదర్శించడం ఎన్నాళ్ల నుంచో ఆనవాయితీగా వస్తున్న వ్యవహారం. అయితే ప్రస్తుతం ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు చేయడంపై పలు హీరోల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ లేనిది కొత్తగా సినిమాలపై ఆంక్షలు విధించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Read Also: రివ్యూ: పుష్ప ఏపీ ప్రభుత్వం తాజాగా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ‘పుష్ప ది రైజ్’ పేరుతో విడుదలైంది. వచ్చే ఏడాది సెకండ్ పార్ట్ రానుంది. అయితే సెకండ్ పార్ట్‌కు ఏ పేరు పెడతారో అని బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు పుష్ప ది రైజ్ చివర్లో సెకండ్ పార్ట్ మూవీ పేరును దర్శకుడు సుకుమార్ రివీల్ చేశాడు. సెకండ్ పార్ట్‌కు ‘పుష్ప-ద రూల్’…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తెలుగు మీడియా ప్రెస్‌మీట్‌ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ… ఒక డైరెక్టర్ హీరోను ప్రేమిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో.. ఆ సినిమానే పుష్ప అని స్పష్టం చేశాడు. దర్శకుడు సుకుమార్ కెరీర్‌లో పుష్ప అనేది ఒక సినిమా కాదని.. తన మీద ప్రేమను చూపించుకోవడానికే తీసిన సినిమా లాగా…
అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తున్న మూవీ ‘బంగార్రాజు’. 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు ఈ మూవీ సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. చైతూ బర్త్ డే సందర్భంగా ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్‌లో చిన్న బంగార్రాజుగా నాగచైతన్య అదరగొట్టాడు. తాజాగా ఈ సినిమాలో పార్టీ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ పాట ఊర మాస్ సాంగ్ అని తెలుస్తోంది. పార్టీ సాంగ్ ఆఫ్…
తమిళ అగ్ర హీరో సూర్య సినిమాలు ఇటీవల వరుసగా ఓటీటీల్లో విడుదలయ్యాయి. గత ఏడాది ఆకాశమే నీ హద్దురా, ఈ ఏడాది జై భీమ్ సినిమాలతో సూర్య మంచి హిట్లు అందుకున్నా ఆ సినిమాలు థియేటర్లలో విడుదలైతే బాగుండేదని అభిమానులు భావించారు. ఈ నేపథ్యంలో సూర్య కొత్త సినిమా థియేటర్లలోనే రాబోతోంది. సూర్య నటించిన తాజా సినిమా ‘ఈటీ’ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఐదు భాషల్లో…
బాహుబలితో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నటుల్లో రానా దగ్గుబాటి ఒకడు. ఆ సినిమాలో భల్లాలదేవగా రానా నటన అందరినీ ఆకట్టుకుంది. బాహుబలి తర్వాత రానాకు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. అరణ్య, విరాటపర్వం, భీమ్లానాయక్… ఇలా వరుసగా రానా నటిస్తున్నాడు. ఇప్పటికే అరణ్య విడుదల కాగా విరాటపర్వం, భీమ్లా నాయక్ విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ రోజు రానా బర్త్‌డే కావడంతో విరాటపర్వం సినిమా నుంచి ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. Read Also: రానా బర్త్‌డే…
పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’. మలయాళం సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు ఈ సినిమా రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం పవర్‌స్టార్ అభిమానులే కాదు రానా అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం హీరో రానా పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. Read Also: ఫ్యాన్స్ రచ్చపై స్పందించిన ఐకాన్ స్టార్.. ఎప్పుడూ మర్చిపోను..! రానా బర్త్‌డే కానుకగా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’ నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా చాలా సినిమాల్లో ఐటమ్ సాంగ్ అంటే సెకండ్ హాఫ్‌లోనే ఉంటుంది. అయితే ‘పుష్ప’లో మాత్రం ఇంటర్వెల్‌కు ముందే సమంత ‘ఊ అంటావా మావా..’ అంటూ తన ఐటమ్ సాంగ్‌తో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పాట మాస్ ప్రేక్షకులకు మంచి ట్రీట్ అని.. ఇందులో బన్నీ, సమంత స్టెప్పులు అభిమానులను ఉర్రూతలూగిస్తాయని…
తెలంగాణ గ్యాంగ్‌స్టర్‌గా చెలామణి అయిన నయీం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘నయీం డైరీస్’ చిత్రానికి హైకోర్టులో చుక్కెదురైంది. నయీం డైరీస్ మూవీలో అసభ్యకర దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారురాలు బెల్లి లలిత కుటుంబసభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అభ్యంతకర సన్నివేశాలు తొలగించేవరకు సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. Read Also: ఫ్యామిలీతో రజినీకాంత్ బర్త్ డే సెలెబ్రేషన్స్… పిక్స్ వైరల్ అయితే…
పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య ‘అఖండ’ చిత్ర బృందానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలియజేశాడు. తాను ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పవచ్చు కానీ ఈ వేదికపైనే ఎందుకు చెప్తున్నానంటే… అఖండ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో ఊపును తెచ్చిందని బన్నీ వ్యాఖ్యానించాడు. చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తి వచ్చి మ్యాచ్ ఆడి ఫస్ట్ బాల్నే సిక్సర్ కొడితే ఎంత కిక్ వస్తుందో.. తనకు ఆ కిక్ బాలయ్య అఖండ…